36.4 C
Hyderabad
Saturday, April 19, 2025
spot_img

‘బ్లాక్, వైట్ అండ్ గ్రే – లవ్ కిల్స్’ ట్రైలర్ విడుదల

సోనీ లివ్‌లో డాక్యుమెంట్-డ్రామాగా ‘బ్లాక్ వైట్ & గ్రే – లవ్ కిల్స్’ నుంచి అద్భుతమైన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సిరీస్‌లోని విషయాన్ని చెప్పేలా, ఉండే సంక్లిష్టమైన, ఆలోచించపజేసేలా ట్రైలర్‌ను కట్ చేశారు.

ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం, వాటి నుంచి తప్పించుకునే యువకుడు, అతడితో ముడిపడి ఉన్న హత్యలు, వాటి వెనుకున్న రహస్యాల్ని ఛేదించే జర్నలిస్ట్ డేనియల్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. డేనియల్ దర్యాప్తు ఈ సిరీస్‌లో ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ట్రైలర్ ప్రస్తుతం సిరీస్ మీద అంచనాల్ని పెంచేస్తోంది.

మయూర్ మోర్ మాట్లాడుతూ.. ‘బ్లాక్, వైట్ అండ్ గ్రే – లవ్ కిల్స్‌ ప్రాజెక్టులో భాగం కావడం ఆనందంగా ఉంది. ఇది ఒక బోల్డ్, జానర్-బెండింగ్ డాక్యుమెంటరీ. క్రైమ్ థ్రిల్లర్‌ ఇన్వెస్టిగేటివ్ జానర్‌లో ఇది ది బెస్ట్‌గా నిలుస్తుంది. ఈ కథ అపరాధం, అమాయకత్వం, న్యాయం వంటి వాటిపై అవగాహన కల్పించి.. ప్రశ్నించేలా చేస్తుంది. నా పాత్ర చాలా బాగా వచ్చింది. ఆడియెన్స్ అంతా కూడా ఈ కథకు కనెక్ట్ అవుతారు. ఇది మిమ్మల్ని చాలా కాలం వెంటాడుతుంది’ అని అన్నారు.

పుష్కర్ సునీల్ మహాబల్మ్ దర్శకత్వం వహించిన బ్లాక్, వైట్ & గ్రే – లవ్ కిల్స్‌ను స్వరూప్ సంపత్, హేమల్ ఎ. ఠక్కర్ నిర్మించారు. టిగ్మాన్షు ధులియాతో పాటు, ఈ సిరీస్‌లో మయూర్ మోర్, పాలక్ జైస్వాల్, దేవేన్ భోజని, ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్, హక్కిమ్ షాజహాన్, అనంత్ జోగ్, కమలేష్ సావంత్ తదితరులు నటించారు.

Latest Articles

ఆస్పత్రుల్లో జరిగే అన్యాయాలపై పోరాటమే ‘డియర్ ఉమ’

తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం నేడు ఏప్రిల్ 18న విడుదలైంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్