స్వతంత్ర వెబ్ డెస్క్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విటర్‌లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్.. 150 ఎకరాల్లో వేశారని ఎద్దేవా చేశారు. రైతులకు ఫ్రీ ఎరువులు అని.. వారిని గంటల తరబడి క్యూలో నిలబెట్టాడని రేవంత్ విమర్శించారు. ‘‘అనగనగా ఒక కేసీఆర్.. వరి వేస్తే ఉరన్నాడు. ఆయనే 150 ఎకరాలల్లో వేశాడు. 24 గంటల కరెంట్ అన్నాడు. లాగ్ బుక్ చూస్తే పట్టుమని పది గంటలు లేదు. రైతులకు ఎరువులు ఫ్రీ అన్నాడు.. గంటల తరబడి క్యూల నిలబెట్టాడు. “కథలు” కంచికి – కేసీఆర్ ఫాం హౌస్ కి’’ అని రేవంత్ పేర్కొన్నారు.