టాలీవుడ్ రౌడీ స్టార్ గా పేరుపొందిన విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా బాక్సాఫీసు వద్ద పల్టీ కొట్టింది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాన్ ఇండియా సినిమాగా తీయడం, ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ని తీసుకురావడం, స్పోర్ట్స్, యాక్షన్ డ్రామాగా సినిమాని నడిపించడం, ఇలా ఎన్ని చేసినా అనుకున్న ఫలితం రాలేదు.
ఆ తర్వాత ఓటీటీపై విడుదలై కూడా పెద్ద ప్రభావం చూపించలేదు. ఇక ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ గా ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షో గా ప్రముఖ ఛానల్ ‘స్టార్ మా’ లో డిసెంబర్ 11 సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. మరి ఇక్కడైనా ఇంటిలో కూర్చుని చూసే అశేష ప్రేక్షకులు ఏమంటారోననే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.
బాలీవుడ్ అందాల భామ అనన్యా పాండే అందాలు మెరిపించలేదు, రమ్యకృష్ణ అరుపులు సినిమాలో ఆకట్టుకోలేదు, వెరసీ సినిమా బాక్సీఫీసు వద్ద బోల్తా కొట్టింది. అయితే ‘అమ్మానాన్న తమిళమ్మాయి’ కి దగ్గర ఉండబట్టే ఆకట్టుకోలేదని ఒక టాక్ వినిపించింది. మరిప్పుడు బుల్లితెర ప్రేక్షకులను ఎంత మేర లైగర్ ఆకట్టుకుంటాడో చూడాలి.