Life Style |ఓ వ్యక్తి జీవితాన్ని రెండు భాగాలుగా విభజిస్తే.. పెళ్లికి ముందు.. పెళ్లికి తర్వాత అనుకోవచ్చు.. సాధారణంగా ఎవరైనా జీవితంలో కొత్తదనాన్ని ఆస్వాదిస్తారు. ఏదైనా ప్రదేశాన్ని ఓసారి చూస్తే.. దానిని మళ్లీ మళ్లీ చూడటానికి ఇష్టపడము.. అదే మనం చూడని ప్రదేశమైతే.. వెంటనే చూడాలనే ఆసక్తి ఉంటుంది. అలాగే పెళ్లికాని వారు వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటారు. వైవాహిక జీవితం గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. తీరా పెళ్లైన తర్వాత.. ముందు జీవితమే బెటర్ అనుకునేవారు కొందరుంటారు. కాని ప్రతి వ్యక్తి జీవితంలో వైవాహిక జీవితం ఎంతో విలువైనది. దాంపత్య జీవితంలో మనకంటూ ఓ కుటుంబాన్ని నిర్మించుకుంటాం. ఆ కుటుంబంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఉంటాం.
ఈ జీవన ప్రయాణంలో భార్య భర్తల మధ్య కొన్ని సందర్భాల్లో స్వల్ప ఘర్షణలు.. మరికొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద ఘర్షణలు చోటుచేసుకుంటూ ఉంటాయి. అలాగే చిన్నగా మొదలైన ఘర్షణ.. పెద్దదై.. దాంపత్య జీవితానికి బ్రేకులు వేసే ఘటనలు చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అదే ఘర్షణ తర్వాత.. కొద్దిసేపు ప్రశాంతంగా ఆలోచిస్తే అయ్యో.. ఆవేశపడ్డామే అని బాధపడుతూ ఉంటాం. చాలా కుటుంబాల్లో ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటాం. చాలా చిన్న చిన్న విషయాల్లోనే మనస్పర్థలు ఏర్పడతాయి. దాంపత్య జీవితంలో చాలా వరకు మనస్పర్థలు రాకుండా చూసుకోవడం ఉత్తమం. భార్య, భర్తల మధ్య కుటుంబంలో జరిగే తగదాలు పిల్లల జీవితంపై, వారి ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయి. అందుకే కుటుంబంలో తగాదాలు చోటివ్వకపోవడం చాలా మంచిది. అసలు భార్య, భర్తల మధ్య మనస్పర్థలకు కారణం ఏమిటి.. మన జీవితం ఎటువంటి తగాదాలు లేకుండా హాయిగా గడిచిపోయే చిట్కాలు తెలుసుకుందాం.
Life Style |చాలా సందర్భాల్లో భార్య, భర్తల మధ్య కొన్ని విషయాల్లో అవగాహన లోపం వల్ల మనస్పర్థలు వస్తాయి. ఏదైనా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా.. మనకు మనం సొంత ఊహగానాతో అనుమానం పెంచుకోవడం.. తద్వారా ఇష్టాన్ని తగ్గించుకోవడంతో.. మనస్పర్థలు ఏర్పడుతూ ఉంటాయి. అదే సమయంలో భర్త.. భార్య, పిల్లలతో గడిపేందుకు సమయం కేటాయించనప్పుడు.. భార్య, పిల్లల ఇష్టాలను తెలుసుకోకపోవడం, వారి ఇష్టాలను ఇగ్నోర్ చేయడంతో మనస్పర్థలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. భార్యతో కాకుండా.. ఇతర మహిళలతో ఎక్కువుగా మాట్లాడటం లేదా ఇతరులను ఎక్కువుగా ప్రశంసించడం ద్వారా కూడా భార్య, భర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడుతూ ఉంటాయి. మరోవైపు తన మాటే నెగ్గాలని భార్య, భర్తలు అనుకోవడం. పంతాలకు వెళ్లడం ద్వారా కూడా కుటుంబంలో వివాదాలకు కారణమవుతూ ఉంటాయి.
భార్య, భర్తల మధ్య వివాదాలు లేకుండా లైఫ్ బిందాస్‌గా గడిచిపోవాలంటే మాత్రం కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఒకరోజులో ప్రతి పనికి కొంత సమయాన్ని ఎలా కేటాయిస్తామో.. అలాగే ఇతర అంశాల జోలికి వెళ్లకుండా.. భార్య, పిల్లలతో గడిపేందుకు కొంత సమయాన్ని కేటాయించాలి. భార్య, భర్తల మధ్య కష్ట, సుఖాలు షేర్ చేసుకోవాలి. ఒకరి ఇష్టాలను మరొకరు తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఒకరిని మరొకరు నొప్పించకూడదు. అదే సమయంలో ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఏకపక్ష నిర్ణయాలు కాకుండా.. ఆ నిర్ణయంలో భాగస్వామిని.. భాగస్వాములు చేయడం ఉత్తమం. ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు.. అందులో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించి.. తుది నిర్ణయాన్ని తీసుకోవడం ఉత్తమం. ఫోన్లతో గడిపే సమయాన్ని కుటుంబంతో గడిపేందుకు వెచ్చిస్తే భార్య, భర్తల మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది. అనవసరంగా చిన్న చిన్న విషయాలకు ఒకరిపై మరొకరు అనుమానం పెంచుకోవడం, చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం వంటివి మంచిది కాదు. పైన పేర్కొన్న టిప్స్ ఫాలో అయితే లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది.
గమనిక: ఇది కేవలం అవగాహన, సమాచారం కోసం ఇవ్వబడినడి మాత్రమే..
Read Also: పేపర్ లీకేజీల వెనుక సూత్రధారులెవరు? పాత్రధారులెవరు?
Follow us on: Youtube, Instagram, Google News