ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Harish Rao), ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(Karumuri Nageswar rao) సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకున్నారు. తాజాగా మంత్రి హరీశ్ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి(Lella Appi Reddy) మండిపడ్డారు. హరీశ్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అసలు హరీశ్ కు సిగ్గుందా.. ఏపీ డెవలెప్మెంట్ గురించి ఏం తెలుసని విమర్శిస్తున్నారని తీవ్ర స్వరంతో రెచ్చిపోయారు .
ఏపీలో జరిగే సంక్షేమ పథకాలు హరీశ్ కళ్లకు కనపడడం లేదా? అని ప్రశ్నించారు. నాలుగు చినుకులు పడితే హైదరాబాద్ పరిస్థితి ఏంటని విమర్శించారు. అలాంటి మీరా? ఏపీ అభివృద్ధిపై మాట్లాడేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కూతురు కవిత ఏం చేస్తున్నారో అందరికి తెలుసన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కాదు.. మీ సింగరేణి నష్టాల గురించి ముందు మాట్లాడండని దుయ్యబట్టారు. మా మౌనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని హరీశ్ ను అప్పిరెడ్డి(Lella Appi Reddy)హెచ్చరించారు.
Also Read: మా జోలికి వస్తే మంచిది కాదు.. ఏపీ మంత్రులకు హరీశ్ వార్నింగ్
Follow us on: Youtube, Koo, Google News