స్వతంత్ర, వెబ్ డెస్క్: సీఆర్డీఏ కమిషనర్ ని కలిసిన అమరావతి రైతు సమన్వయ కమిటీ నేతలు.. కౌలు చెల్లింపు ఆలస్యం పై గంటకు పైగా కమిషనర్ తో చర్చించారు. ఈ సందర్భంగా సీబీ సీఐడీ కేసులు త్వరగా తేల్చాలని కమిషనర్ ను రైతులు కోరారు. సెంట్ స్థలాలు డెవలప్మెంట్ చేసిన విధముగా రైతుల ప్లాట్ లు డెవలప్మెంట్ చేయాలని కోరారు. రాజధాని ప్రాంతాల్లో డెవలప్మెంట్ కి డబ్బులు లేవని కమిషనర్ తేల్చి చెప్పారు. ఏదేమైనా వచ్చేనెల 8వ తేదీ లోగా రైతుల ప్లాట్లు డెవలప్మెంట్ చేయాలని లేకపోతే పోరాటం చేస్తామని కమిషనర్ కు రైతులు వివరించారు. సెంట్ భూములు తరహా లోనే రైతులకు న్యాయం చేయకపోతే సెంట్ భూములను యధా స్థానానికి తీసుకొస్తామన్నారు. అలాగే రైతుల ఫ్లాట్లలో అక్రమంగా మట్టిన తవ్వుకుపోతున్న అంశాలన్నీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతులు తమ దగ్గరికి వచ్చిన సమస్యలపై చర్చించిన కమిషనర్.. మట్టి అక్రమ రవాణా దారులపై చర్యలు తీసుకొంటామని.. అలాగే 25వ తేదీ లోగా కౌలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.