స్వతంత్ర వెబ్ డెస్క్: రీల్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి రియల్ కపుల్ కానున్నారు. త్వరలో వీరి వివాహం జరగనుంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం వీరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది. హైదరాబాద్‌లోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఇక నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు వరుణ్, లావణ్య. ‘లవ్ దొరికిందంటూ’ ఈ లవ్ బర్డ్స్ షేర్ చేసిన ఫొటోలు ఒక్కసారిగా వైరల్‌గామారాయి. కాబోయే పెళ్లి కూతురు లావణ్య కూడా ఇదే ఫోటోలను పోస్ట్ చేస్తూ 2016 నుంచే తమ ఇద్దరి ప్రేమ ఉన్నట్టు తెలిపింది. దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. ‘చూడముచ్చటైన జంట, క్యూట్ జోడీ’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.వరుణ్‌తేజ్ – లావణ్య ఎంగేజ్‌మెంట్ సందర్భంగా సోషల్‌మీడియాలో #VarunLav హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
ఇక, వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘గాండీవధారి అర్జున’ చిత్రీకరణ దశలో ఉంది. ఆగస్టు 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా పూర్తైన తర్వాత వరుణ్.. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్, కరుణ్‌కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. మరోవైపు, లావణ్య ప్రస్తుతం కోలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నారు. అధర్వ హీరోగా ఇది తెరకెక్కుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిననున్న ఓ సినిమాలో అలాగే, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రానున్న ఓ వెబ్‌సిరీస్‌లోనూ ఆమె నటించనున్నారు.