బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం సడెన్‌గా క్షీణించింది. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండడంతో ఆయన బీహార్ రాజధాని పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లారు. కాగా దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2022లో సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి కూడా చేయించుకున్నారు. లాలూ కిడ్నీలు 25 శాతం మాత్రమే పనిచేయడంతో మార్పిడి చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించారు.