రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఇంట్లో ఉన్న సమయంలో రామరాజ్య స్థాపన పేరుతో వచ్చిన కొందరు రంగరాజన్‌పై దాడి చేశారు. ఈ ఘటనపై కేటీఆర్ మండిపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మండల నాయకులతో కలిసి వెళ్లిన కేటీఆర్ చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను పరామర్శించారు.
తెలంగాణలో శాంతిభద్రతలు అధోగతి పాలయ్యాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అర్చకుడు రంగరాజన్‌పై దాడి అత్యంత దుర్మార్గమైన, నీచమైన చర్య అని ఖండించారు. ఇది ఎవరు చేసినా.. ఏ పేరిట చేసినా ఏ ఎజెండాతో చేసినా ఉపేక్షించకూడదని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. దైవసేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ పరిస్థితే ఇలా ఉందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు కేటీఆర్.