స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: మహబూబ్ నగర్ జిల్లాలో ఇంజనీరింగ్ చదివిన ఐటీ విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు అందించనుంది. ఐటీ ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా మహబూబ్ నగర్ లోనే ఐటీ టవర్ ఏర్పాటు కానుంది. జాతీయ అంతర్జాతీయ ఐటీ కంపెనీలు ఇక్కడికి రాబోతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లోని ఐటీ కంపెనీలకు పలు విధాలుగా అహ్వనం పలుకుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే పర్యటలను చేశారు. ఇవాళ ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ ఐటీ టవర్ ని ప్రారంభించనున్నారు. అందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. మహబూబ్ నగర్ సమీపంలోని 44 వ జాతీయ రహదారి దివిటిపల్లి వద్ద 377 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ కారిడార్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నాలుగు ఎకరాల్లో ఐటీ ఇంటిగ్రేటెడ్ టవర్ ను 40 వేల రూపాయాల వ్యయంతో లక్ష చదరపు అడవుల విస్టీర్ణంలో ఐటీ టవర్ ను నిర్మిస్తున్నారు.
నాలుగు అంతస్తుల్లో విస్తరిస్తన్న ఈ భవన మ్యుఖ్యోద్దేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. స్థానిక విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే విధంగా ఈ ఐటీ కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నారుఅంతేకాకుండా నిరుద్యోగ విద్యార్థులకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇక్కడే ఇవ్వనున్నారు. నేటి ఐటీ కంపెనీలో 6 ఐటీ కంపెనీలు ప్రారంభం అవుతున్నాయి. ఐటీ కారిడార్ లో మల్టీ పర్పస్ గా అమర రాజా కారిడార్ కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే ఏడాదిన్నరలో అమర్ రాజా యూనిట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఉత్పత్తి చేపట్టాలన్న లక్ష్యంగా పనులు చేస్తున్నారు. ఈ పనులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.