సీఎం రేవంత్‌రెడ్డి మూసీ పాదయాత్రపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విట్టర్ వేదికగా మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోకాలికి దెబ్బ తగిలితే బోడి గుండుకు కుట్లు వేసినట్టు గుంపు మేస్త్రీ పాలన తీరు ఉందని సైటర్లు వేశారు. హైదరాబాద్‌లో మూసీ బాధితులు ఉంటే.. నల్లగొండలో మూసీ పరివాహక ప్రాంత రైతులను కలవడంలో రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కూల్చిన ఇండ్లెక్కడ..?, కాలిన కడుపులెక్కడ..? నువ్ తిరుగుతున్న ప్రాంతం ఎక్కడ అంటూ విమర్శలు గుప్పించారు. ఆగిన గుండెలెక్కడ, రగిలిన మనసులెక్కడ .. నువ్వు చేసిన ఎర్ర రంగు మార్కింగ్ ఎక్కడ – నువ్ చేస్తున్న పాదయాత్ర ఎక్కడ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
నీ కుట్రలకు అంబర్పేట్, అత్తాపూర్ అతలాకుతలం అవుతుంటే.. నీ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నది ఎక్కడ అని సీఎం యాదాద్రి టూర్‌పై విమర్శించారు కేటీఆర్. నీ మూసి దాహానికి అత్తాపూర్ ఆగమైంది -గోల్నాక గొల్లుమంటుంది-దిలుషుక్ నగర్ ఢీలా పడ్డది.. అయ్యా సంబరాల రాంబాబు – నీ అన్యాయానికి.. అవేదనలు, ఆవేశాలు, అక్రాందనాలు వినిపిస్తున్నవి.. కనిపిస్తున్నవి అక్కడ కాదు.. ఇటు వైపు రా ఇక్కడ చెయ్యి నీ పాదాల మీద యాత్ర అని రాసుకొచ్చారు. తేలు మంత్రం రానోడు.. పాము కాటుకు మంత్రం ఏసినట్లు.. పాలన తెల్వని నీకు పగ్గాలు అప్పగిస్తే ప్రజల బతుకుల్ల మన్ను పోసినవ్.. నాయకత్వం అంటే కూల్చడం కాదు.. నిర్మించడం.. నాయకత్వం అంటే తొవ్వ తప్పడం కాదు.. తొవ్వ చూపడం ట్విట్టర్ వేదికగా రేవంత్ పాలనపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్.