మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ని తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఏసీబీ విచారణకు అడ్వకేట్‌ను అనుమతించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు కేటీఆర్.
రేపు ఏసీబీ ఎదుట కేటీఆర్ హాజరుకావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈనెల 6న కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లాల్సి ఉంది. విచారణకు ఏసీబీ ఆఫీసుకు తన లాయర్‌తో వెళ్లారు. గేటు వద్దే వారిని అడ్డుకున్నారు. లాయర్‌కు అనుమతి లేదని చెప్పారు. కానీ.. తన లాయర్‌ను అనుమతించనిదే విచారణకు రాలేనంటూ అక్కడి నుంచి వెనుదిరిగారు కేటీఆర్. దీంతో ఏసీబీ అధికారులు అదే రోజు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈనెల 9న విచారణకు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.