స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో మరో దిగ్గజ సంస్థకు అంకురార్పణ జరిగింది. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్‌లియూతో కలిసి కేటీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు రూ.1,656కోట్లకు పెట్టుబడితో ఈ పరిశ్రమ నిర్మితం కానుంది. ఈ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం 196 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సుమారు 35వేల మందికి పైగా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఐటీ రంగంలో మరో పదేళ్లలో 15లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు ఏడాదిలోగా పాక్స్‌కాన్ పరిశ్రమ పూర్తి కావాలని కోరుకుంటున్నామని.. మొదటి దశలో 25వేల ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. అంతేకాకుండా యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.