26.5 C
Hyderabad
Saturday, February 28, 2026
spot_img

దక్షిణాది రాష్ట్రాలకు జరగనున్న అన్యాయంపై కేటీఆర్ ఆవేదన

స్వతంత్ర, వెబ్ డెస్క్: 2026లో జరగనున్న లోక్‌ససభ డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరగనుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు జనాభా నియంత్రణ పద్ధతులు పాటించిన దక్షిణాది రాష్ట్రాలు ప్రస్తుతం తీవ్ర అన్యాయానికి గురయ్యే అవకాశం ఉందని ట్వీట్ చేశారు. జనాభా ప్రతిపాదికన జరగనున్న లోక్‌సభ స్థానాల డీలిమిటేషన్‌పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

జనాభాను నియంత్రించిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు తమ ప్రగతిశీల విధానాలకు తీవ్రంగా శిక్షించబడుతున్నాయని పేర్కొన్నారు. జనాభా నియంత్రణ మాత్రమే కాకుండా అన్ని రకాల మానవాభివృద్ధి సూచీల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని చెప్పారు. కేవలం 18 శాతం జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు 35 శాతం GDP నిధులు అందిస్తున్నాయని తెలిపారు. దేశ అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్న దక్షిణాది రాష్ట్రాలు అసంబద్ధమైన డిలిమిటేషన్ విధానం వల్ల భవిష్యత్తులో తమ ప్రాధాన్యత కోల్పోకకుండా చూడాలన్నారు. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా పార్టీలతో పాటు ప్రజలు గళమెత్తాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్