టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన నేత పవన్ కళ్యాణ్ యుద్ధం కామెంట్స్‌కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ యుద్ధం ఎక్కడి నుండి చేస్తారని ప్రశ్నించారు. ఎవరు ఎక్కడి నుండి యుద్ధం చేస్తారో వారికైనా క్లారిటీ ఉందా అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ సిద్ధం పేరుతో దూసుకెళ్తున్నారన్నారు. టీడీపీ, జనసేన ఎన్ని చోట్ల పోటీ చేస్తారో ముందు చూసుకోండని…ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడితే అది యుద్దం కాదని కొడాలి నాని మండిపడ్డారు.


