KMC medical student Preethi dies at NIMS: ఒక మారుమూల తండా నుంచి ఎంతో కష్టపడి, ఎంతో దూరం నడుచుకుంటూ వెళ్లి చదువుకుని, హాస్టళ్లలో పడరాని పాట్లు పడి…డాక్టర్ కావాలనే లక్ష్యం కోసం మొక్కవోని ధైర్యంతో చదువుకుంది. ఒకొక్క మెట్టు ఎక్కి, ఎట్టకేలకు వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) లో చేరింది.
నాలుగేళ్లు చదివేసుకున్నాం. హమ్మయ్యా…ఇక ఎటువంటి ఆటంకాలు లేవు…చక్కగా పీజీలో చేరాం…ఒక ఏడాది తర్వాత తన కుటుంబానికి, తన తండావాసులకు మేలు చేయవచ్చుననే భావనతో, ఎన్నో కలలతో పీజీలో చేరిన… ఏడాదికే తన కలలన్నీ కల్లలైపోయాయి. (Preethi) విగతజీవిగా మారిపోయింది.
ఎంతో అడ్వాన్స్ గా ఉన్నారు, (India) భారతదేశం ఎదిగిపోయింది… (Youth) యువత చక్కగా చదువుకుని ముందుకెళుతున్నారని ఎంతో గొప్పగా చదువుకుంటున్నా…ఇంకా ఎక్కడో ఇలాంటి సంఘటనలు తారసపడుతూనే ఉన్నాయి. (Eve Teasing ) ర్యాగింగ్ భూతం ఇంకా మిగిలే ఉందనడానికి (Preethi Suicide) ) ప్రీతి ఆత్మహత్య ఒక నిదర్శనం.
మెడికో (Medico) సీనియర్లందరూ అర్జున్ రెడ్డి (ArjunReddy) సినిమాలో హీరోల్లా ఫీలై పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మెడికల్ స్టూడెంట్స్ లో ఈ పైత్యం మరీ ఎక్కువైపోయిందని, అమ్మాయిలను వేధించడం సర్వ సాధారణమైపోయిందనే వ్యాక్యానాలు వినిపిస్తున్నాయి. దురదృష్టవశాత్తూ ఆ సినిమాలో హీరోయిన్ పేరు కూడా ‘ప్రీతి’ ( Preethi) కావడం యాదృచ్ఛికమనే చెప్పాలి. ఈ సినిమాలు, వెర్రి ప్రేమల తాలూకు ప్రభావం యువతపై ఉందని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని అప్పుడే సామాజిక మాధ్యమాల్లో సంప్రదాయవాదులు గళమెత్తుతున్నారు.
తను ఒక మారుమూల తండా నుంచి రావడంతో…ఈ నాగరిక ప్రపంచంలోని ముష్కరుల దాడికి తట్టుకోలేకపోయింది. వారిని ఎదిరించడం చేతకాక…తనకు తనే ఆత్మహత్యకు పాల్పడిందని అంతా వ్యాక్యానిస్తున్నారు. చావు బతుకుల మధ్య ఉన్న (Preethi) ప్రీతిని హైదరాబాద్ నిమ్స్ (NIIMS) కు తరలించి ప్రత్యేక చికిత్సలు చేసినా… చివరి వరకు పోరాడి తనువు చాలించింది.
అంతా అయిపోయిన తర్వాత ప్రభుత్వ పెద్దలు శాంతి చర్చలు చేస్తున్నారు. వారి కుటుంబంలో ఒకరికి పంచాయతీ రాజ్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం, రూ.30 లక్షల నగదు ఇస్తామని (Telangana Minister Harish Rao) మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఎంత చేసినా ఎదిగిన కూతురు మళ్లీ వస్తుందా? అని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ప్రీతి మరణంపై ప్రతిపక్షాలు కూడా ఆందోళన చేపట్టడంతో పోలీసులు నిమ్స్ ఆసుపత్రి ముందు మోహరించారు.
పోస్ట్ మార్టమ్ అనంతరం ప్రీతి (Preethi) డెడ్ బాడీని బోడుప్పల్ లోని నివాసానికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి ప్రీతి స్వగ్రామం వరంగల్ గిర్ని తండాకు ( Warangal Girni Tanda) తరలించనున్నారు. అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నిచోట్లా ఎక్కడికక్కడ పోలీసులను (Police) మోహరించారు.
మరోవైపు కొత్త వివాదం ఒకటి బయలుదేరింది. ప్రీతీది (Preethi Suicide)) ఆత్మహత్య కాదని, ఆమె ఇంజక్షన్ తీసుకోలేదని, అదంతా కట్టుకథ అని డాక్టర్స్ అసోసియేషన్ (Doctors association) ఆరోపించింది. తన కుమార్తె మరణంపై విచారణ కమిటీ వేయాలని తండ్రి డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో ప్రీతి కుటుంబసభ్యులు, బంధువుల ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చింది.