25.8 C
Hyderabad
Monday, March 31, 2025
spot_img

“కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్” సీజన్ 2.. ఎల్లుండి నుంచే!

పదహారు మంది సెలెబ్రిటీలు.. ఇద్దరు స్టార్ లీడర్స్.. ఒక ఎనర్జిటిక్ ప్రేజెంటర్.. ఒక సక్సెస్ ఫుల్ ఫార్మాట్.. గెలవాలనే పట్టుదల.. ఓటమి ని గెలుపుగా మలుచుకోవాలనే తపన.. ఒకే వేదికపైన ప్రేక్షకులకు వినోదం అందించడానికి ప్రేక్షకుల ముందుకు వస్తే.. ? ఆ వేదిక పేరు, ఆ వేడుక పేరు “కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్”. ఇది స్టార్ మా అందించబోతున్న సరికొత్త షో. కిరాక్ బాయ్స్, కిలాడి గాళ్స్ హోరా హోరీగా పోటా పోటీగా తలపడబోతున్నారు. ఇది – అమ్మాయిలకీ అబ్బాయిలకీ మధ్య ఇంటరెస్టింగ్ వైల్డ్ ఫైర్.. తగ్గేదేలే అని పోటీ పడుతున్న టీమ్స్ తో కొత్త వార్ “కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్” సీజన్ 2. !!

సినిమా, టీవీ రంగాల్లో తమదైన ముద్ర వేసిన సెలెబ్రిటీలు ఈ షో లో రెండు టీమ్స్ గా ఓ ఆట ఆడబోతున్నారు. అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు ఛాలెంజెస్ తో ఒకరిని మించి మరొకరు సత్తా చూపించడానికి రెడీ ఆవుతున్నారు. గెలుపు కోసం ఎత్తులు, పై ఎత్తులతో ప్రేక్షకులను అలరించడానికి అన్ని అస్త్రాలు సమకూర్చుకుంటున్నారు. ఈ షో లో పాల్గొంటున్న ప్రతి కంటెస్టెంట్ ఒక్కో స్పెషల్ టాలెంట్ తో ఈ షో కి వస్తున్నారు. “ఎప్పటికీ.. నో కాంప్రమైజ్ ” అనే యాటిట్యూడ్ తో ప్రతిఒక్కరు ఎదురు టీం తో తలపడబోతున్నారు.

స్మాల్ స్క్రీన్ సంచలనం శ్రీముఖి ఎనర్జిటిక్ గా ఈ రెండు టీముల సమరాన్ని నడిపించబోతున్నారు. ఆర్టిస్టులను, సెలబ్రిటీ లను డీల్ చేయడంలో ఎంతో అద్భుతమైన సమయస్ఫూర్తి తో వ్యవహరించే శ్రీముఖి 16 మంది కంటెస్టెంట్స్ ని, ఇద్దరు లీడర్స్ ని బాలన్స్ చేయబోతున్నారు. ఈ షో లో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ “కిరాక్ బాయ్స్” తరఫున లీడ్ చేయబోతున్నారు. ప్రెజెంటర్ గా, నటిగా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న అనసూయ “కిలాడి గాళ్స్”కి ప్రతినిధిగా వుంటున్నారు. ఒకసారి గెలిచిన ఆనందంలో, దాన్ని ఈ సారి కూడా రిపీట్ చేద్దాం అనుకుంటున్న “కిరాక్ బాయ్స్”, ఫస్ట్ సీజన్ ఓడిపోయిన అవమానంతో ఈ సీజన్ ఎలాగైనా కొట్టాలి అనే పట్టుదలతో రగిలిపోతున్న “కిలాడి గాళ్స్” మధ్య పోటీ చాలా చాలా ఇంటరెస్టింగ్ గా వుండబోతోంది.

కిరాక్ బాయ్స్ గా ఈ షో లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు – మానస్, కాస్కో నిఖిల్, బంచిక్ బబ్లూ, పృథ్వి, శివ్, ఇమ్మాన్యుయేల్, దిలీప్, సాకేత్. కిలాడి గాళ్స్ గా పోటీ పడబోతున్నవారు – హమీదా, రోహిణి, తేజస్విని మడివాడ, సుష్మిత, లాస్య, శ్రీ సత్య, దేబ్ జానీ, ఐశ్వర్య. 16 మంది సెలబ్రిటీ లు ఒకే వేదికపై చేయబోతున్న సందడి, సంబరం తో ఈ షో మార్చి 29 న ప్రారంభం అవుతుంది.

Latest Articles

‘మనంసైతం’ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

'కాదంబ‌రి ఫౌండేష‌న్‌-మనంసైతం' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో షుర్ (Shure) సంస్థ వారి CSR సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం జ‌రిగింది. హైద‌రాబాద్‌ చిత్ర‌పురి కాల‌నీలోని ఎల్ఐజీ ప్రాంగ‌ణంలో రెనోవా హాస్పిట‌ల్ విద్యాన‌గ‌ర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్