లిక్కర్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో కుట్ర చేసి సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారన్నారు. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతే మాగుంటకు రాఘవకు బెయిల్ ఇచ్చారని గుర్తు చేశారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బీజేపీ మద్దతు ఇస్తోందన్నారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి కేజ్రీవాల్‌కు వ్యతిరేకం గా స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు. ఆప్‌ను నాశనం చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవకు బెయిల్ ఇచ్చా రని… ఇప్పుడు మాగుంట శ్రీనివాస్‌కు టీడీపీ టికెట్ ఇచ్చారన్నారు. బీజేపీతో పొత్తులో భాగంగానే ఇదంతా జరిగిందని సంజయ్ సింగ్ అన్నారు. మాగుంట శ్రీనివాస్ ఇప్పుడు మోదీ ఫోటో పట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. ఇటీవలె లిక్కర్ స్కాంలో రెండు రోజుల క్రితం బెయిల్‌పై సంజయ్ సింగ్ విడుదలయ్యారు.