- ఆరెంజ్ ట్రావెల్స్ రాకతో డీలాపడ్డ కేశినేని ట్రావెల్స్
- తమ్ముడిని పార్టీ ప్రోత్సహిస్తుండడంతో ఓపెన్‌గానే ఫైరవుతున్న నాని
తెలుగుదేశం అధిష్టానం మీద ఎంపీ కేశినేని నాని పూర్తిగా తిరగబడిపోయారు. టికెట్ ఇవ్వకపోయినా ఫర్వాలేదు అని తెగేసి చెబుతున్నారు. మొన్నటి దాకా మామూలు కామెంట్స్ చేసిన కేశినేని… ఇప్పుడు విజయవాడలోని టీడీపీ నాయకులు అందరినీ ఉతికి ఆరేస్తున్నారు. రాజధాని ఉద్యమం పుణ్యమాని విజయవాడలో క్వీన్ స్వీప్ చేయాలనుకొంటున్న టీడీపీ ఆశల మీద కేశినేని అసమ్మతి రూపంలో నీళ్లు చల్లుతున్నారు. అసలు టీడీపీ నాయకత్వంతో కేశినేనికి ఎక్కడ పేచీ ఉందో పరిశీలిద్దాం.
2010 తర్వాత ప్రైవేటు బస్సుల వ్యాపారంలో కేశినేని ట్రావెల్స్ అంతకంతకూ పెరిగిపోయింది. ఒకానొక దశలో కేశినేని నాని.. కేశినేని ట్రావెల్స్ పేరుతో బస్ రవాణా బిజినెస్‌లో రారాజుగా వెలుగొందారు. కేశినేని ట్రావెల్స్ కు దేశవ్యాప్తంగా పెద్దపేరు వచ్చేసింది. అన్ని రాష్ట్రాలకూ బస్సులు నడిపిన కేశినేని నాని వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోడానికే టీడీపీలో చేరారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆయన వ్యాపారం అలానే వ్యాప్తిచెంది ఉండేది. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక కేశినేని ట్రావెల్స్ తిరుగులేని స్థాయికి వెళ్లిపోతుందని అనుకొన్నారు. కానీ, తెలంగాణాకు చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ మాత్రం కేశినేని ట్రావెల్స్‌ను ఢీకొంది. రెండు కంపెనీల మధ్య చాలా గొడవలు జరిగాయి. ఆరెంజ్ ట్రావెల్స్‌లో టిఆర్ఎస్ ప్రభుత్వంలోని కీలకమంత్రికి చాలా పెద్దవాటా ఉందని అంటున్నారు. దీంతో ఆరెంజ్ ట్రావెల్స్ ని ఢీకొట్టలేక, ఇటు ప్రోత్సాహకాలు దొరక్క, మొత్తంగా ట్రావెల్స్ రంగం నుంచి కేశినేని బయటకు రావాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇక అప్పటి నుంచీ చంద్రబాబుతో కేశినేని గ్యాప్‌్ పెరుగుతూ వచ్చిందని తెలుస్తోంది.
2019లో ఎంపీగా ఎన్నికైనప్పటికీ తెలుగుదేశం అధిష్టానం పార్లమెంటు వ్యవహారాల్లో గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడుని ప్రోత్సహించినట్లుగా కేశినేని నానిని ప్రోత్సహించలేదు. ఇటు, నాని కూడా పార్టీ కార్యకలాపాలకు నెమ్మదిగా దూరమయ్యారు. ఈలోగా విజయవాడలో తమ్ముడు కేశినేని చిన్నిని పార్టీ నాయకత్వం ప్రోత్సహించటంతో.. చంద్రబాబు కేశినేని నాని ఇక ఓపెన్ గానే ఫైర్ అవుతున్నారట.