టీడీపీ నేత నారా లోకేష్‌పై కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో లోకేష్ లాంటి అసమర్థులు ఉండడం బాధాకరమన్నారు. అసలు ప్రజా జీవితం ఎలా ఉంటుందో లోకేష్‌కు తెలుసా అని ప్రశ్నించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని దేవినేని అవినాశ్, జగన్ అండతో ఎన్నడూ లేనంత గా అభివృద్ధి చేశారన్నారు. టీడీపీ నేతలు రాజకీయాలను బ్రష్టు పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ల్యాండ్ యాక్ట్ గొప్ప చట్టం అని అసెంబ్లీ సాక్షిగా టీడీపీ నేతలు అనలేదా అని నాని ప్రశ్నించారు.ఇక ఎన్నికల ప్రచా రంలో జగన్ ప్రభుత్వంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నార న్నారు అవినాశ్. సంక్షేమ పథకాల ను ప్రజలకు అందించడంతో ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. జగన్ ప్రభుత్వానికి మరో అవకాశం ఇస్తామని ప్రజలే చెపుతున్నారన్నారు అవినాశ్.


