గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభించాల్సిందిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ఎంపీ కేశినేని చిన్ని కోరారు. ఈ మేరకు పార్లమెంట్‌లో వినతిపత్రం అందజేశారు. విజయవాడ నుండి వారణాసి వయా వైజాగ్, విజయవాడ నుండి కలకత్తా వయా విశాఖపట్నం, విజయవాడ నుండి బెంగళూరు వయా హైదరాబాద్ లేదా కొచ్చి, విజయవాడ నుండి అహ్మదాబాద్, విజయవాడ నుండి పుణే విమాన సర్వీసులను ప్రారంభించాలని వినతిపత్రంలో కోరారు. ఇండిగో సంస్థ సర్వే చేసిన ఈ మార్గాల్లో విమాన సర్వీసులు వెంటనే ప్రారంభించేలా చూడాలని అన్నారు. ఎంపి కేశినేని చిన్ని అభ్యర్థనపై రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడుకి అభినందనలు తెలిపారు.


