24.2 C
Hyderabad
Sunday, December 22, 2024
spot_img

సీబీఐ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్, ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్ పిటిషన్‌ను న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం తీహార్ జైలుకు తరలించారు.

అయితే ట్రయల్ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది. ప్రస్తుతం దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు కేజ్రీవాల్‌. ఇదే కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కు కూడా బెయిల్ లభించొచ్చని ఆప్ ఆశలు పెట్టుకుంది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకుంది.

Latest Articles

డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ షాక్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌ నెట్ షాక్ ఇచ్చింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్ నెట్.. వ్యూహం సినిమాకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్