విశాఖ మత్స్యశాఖలో కీచక పర్వం వెలుగు చూసింది. తోటి మహిళా ఉద్యోగిపై ఫిషింగ్ హార్బర్ జాయింట్ డైరెక్టర్ లాల్ మహ్మద్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తన క్యాబిన్‌కు పిలిపుంచుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో కేసు నమోదు చేసుకుని నిందితుడిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అతడిని తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. చిన్న సెక్షన్లు నమోదు చేసి, తప్పించేందుకు యత్నిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది.


