శ్రీ సత్యసాయి జిల్లాలో వైద్యుడి ముసుగులో ఉన్న కామాంధుడి వేధింపులు తాళలేకపోతున్నామంటూ ఆందోళన బాటపట్టారు ఏఎన్‌ఎంలు. ఉద్యోగానికి వచ్చిన తమనే కాకుండా.. కూతుళ్లను పంపండి అంటూ అసభ్యంగా వ్యవ హరిస్తున్న కీచకుడిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు..? ఇంతకీ ఆ కీచక వైద్యుడెవరు..? బాధతుల డిమాండ్‌కు అధికారుల స్పందనేంటి.?
వైద్య వృత్తిలో ఉండి ప్రాణాలను కాపాడాల్సిన ఓ డాక్టర్ తోటి మహిళా ఉద్యోగస్తుల పాలిట కామ పిశాచిలా మారాడు. శ్రీ సత్యసాయి జిల్లా ఎన్‌ఎస్ గేట్ మండల ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఉదయ్‌ని చూస్తే అక్కడి ఏఎన్‌ఎమ్‌లు వణికిపోతున్నారు. గత కొంత కాలంగా అతడి చేతిలో లైంగిక వేధింపులకు గురవుతున్న ఆ మహిళలు అక్కడ పని చేసేందుకు జంకుతున్నారు. తమను వేధించడమే కాకుండా తమ బిడ్డలను కూడా పంపించమని అసభ్యంగా, దురుసుగా వ్యవహరించడమే కాకుండా తమ కోరిక తీర్చకపోతే రిజైన్ చేసి వెళ్లిపోండని బెదిరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు బాధిత మహిళలు. ఈ మేరకు పీఎహెచ్ వద్ద బైఠాయించి ఉదయ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కామాంధుడు ఉదయ్ వేధింపులపై ఉన్నతాధికారి DMHOకు ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో విచారణ చేపట్టిన వైద్యాధికారిణి మంజువాణి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా ప్రైమరీ సెంటర్‌కు చేరుకున్న ఈ కమిటీ ఉదయ్ కీచక చర్యలపై ఆరా తీసింది. సిబ్బంది నుంచి వస్తున్న ఆరోపణలు ఏంటి.? ఎప్పటి నుంచి ఇలా జరగుతోంది. .? ఎంత మందిని వేధించాడు అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎవరెవరికి అసభ్య మెసేజ్‌లు పంపాడు అన్నది కూడా ఆరా తీశారు. అయితే విచారణకు బాధితుల హాజరుకాగా పై అధికారుల ఆదేశించినప్ప టికీ ఉదయ్ మాత్రం డుమ్మా కొట్టాడు. ఉద్యోగాలు చేసుకోనివ్వకుండా తమను లైంగికంగా వేధిస్తున్న ఉదయ్‌ను వదిలిపెట్ట వద్దని, కఠినంగా శిక్షించాలని మంజువాణికి విజ్ఞప్తి చేశారు బాధిత మహిళలు.
ఏఎన్‌ఎమ్‌ల గోడు విన్న విచారణ కమిటీ ఉదయ్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. సమగ్ర విచారణ జరిపి పైఅధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు సత్యసాయి జిల్లా DM & HO మంజువాణి. ప్రభుత్వం మహిళల రక్షణ కొరకు ఎన్నో చట్టాలను తీసుకువచ్చినా.. అధికారుల్లో మార్పు రాకపోవడంతో నిత్యం మహిళపై వేధిం పులు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్నారు బాధిత మహిళలు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకో వడం వలన లైంగిక దాడులను అరికట్టేం దుకు ఒక అడుగు ముందుకు వేసినట్టు అవుతుందని వారు అభిప్రాయప డ్డారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులు స్పందించి డాక్టర్ పుల్లేటిపల్లి ఉదయ్‌పై చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మరి సమగ్ర విచారణలో ఏం తేలనుంది..? బాధితుల డిమాండ్ మేరకు ఉదయ్‌పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది వేచి చూడాలి.