22.2 C
Hyderabad
Monday, February 3, 2025
spot_img

హైదరాబాద్ తప్ప తెలంగాణలో అభివృద్ధి ఎక్కడా? హరీశ్: కారుమూరి

ఏపీలో పాలనకు, తెలంగాణ పాలనకు భూమికి- ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Harish Rao) వ్యాఖ్యానించారు. తెలంగాణలోని ఏపీ ఓటర్లు అక్కడ ఓటు హక్కు రద్దు చేసుకుని ఇక్కడ ఫొందాలని తెలిపారు. హరీశ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(Karumuri Nageswara Rao) తీవ్రంగా మండిపడ్డారు. హరీశ్ రావు ఏపీకి వస్తే ఇక్కడ ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తామన్నారు. చిన్నవర్షం వస్తే హైదరాబాద్ రోడ్లు జలమయం అయి ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని.. ఇంత ఘోరంగా హైదరాబాద్ ను చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు.

విభజన అనంతరం ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పగిస్తే అప్పులపాలు చేశారని విమర్శించారు. మీరు తెలంగాణను ఎంత అభివృద్ధి చేశారో.. ఎలా నాశనం చేశారో మీ ప్రతిపక్షాలే విమర్శిస్తున్నాయని తెలిపారు. ముందు వాళ్లకు సమాధానం చెప్పుకోండంటూ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో మాత్రమే రోడ్లు వేస్తే సరిపోతుందా? తెలంగాణ మొత్తం అభివృద్ధి ఎక్కడ ఉందని హరీశ్ రావుని కారుమూరి(Karumuri Nageswara Rao) ప్రశ్నించారు.

Also Read: మా జోలికి వస్తే మంచిది కాదు.. ఏపీ మంత్రులకు హరీశ్ వార్నింగ్

Follow us on:  YoutubeKoo Google News

Latest Articles

వసంత పంచమి వేడుకలు – బడులుగా మారిన సరస్వతీ మాత గుడులు

విద్వాన్ సర్వత్ర పూజితే అంటారు. అయితే, విద్వాంసులకు, పండితులకు, గురువులకు అందరికీ గురువు విద్యాదేవత వాగ్దేవీ మాత. సరస్వతీ మాత ఉదయించిన శుభోదయ తిథి మాఘ శుద్ద పంచమి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్