స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కన్నడ నాట ప్రజలు ఏం తీర్పు ఇస్తారోనని తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. దేశంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తో పాటు స్థానిక పార్టీలు సైతం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. మొత్తం 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల్లో సంప్రదాయం ప్రకారం కర్ణాటక అధికారం చేతులు మారుతుందా? లేదా చరిత్ర సృష్టిస్తూబీజేపీనే అధికారంలో కొనసాగుతుందా? లేదా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం అవుతాయా? వీటన్నికి సమాధానాలు మరికొద్ది గంటల్లో తేలనుంది.