భూవివాదంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్‌లోని ఓ ప్లాట్ విషయంలో వివాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో 2003లో గీతా లక్ష్మీ అనే మహిళ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ప్లాట్ కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఫేక్ డాక్యుమెంట్స్‌తో 5 బ్యాంకుల నుంచి గీతా లక్ష్మీ లోన్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. విషయాన్ని దాచిపెట్టి ఎన్టీఆర్‌కు ప్లాట్‌ను మహిళ అమ్మేశారు. తాజాగా ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు యత్నించాయి. దీంతో బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు చేశారు. 2019లో ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ వేశారు. తాజాగా డీఆర్టీలో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించగా జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
భూ వివాదంలో హై కోర్టును ఆశ్రయించిన జూ.ఎన్టీఆర్
0
239
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -
- Advertisement -


