ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై ఇవాళ తీర్పురానుంది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ బెయిల్‌కు సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పులు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తీర్పు వెల్లడించ నున్నారు. లిక్కర్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్టు చేసింది. ఇదే కేసులో జ్యుడిషి యల్ కస్టడీలో ఉండగానే, ఏప్రిల్ 11న సీబీఐ కూడా పీటీ వారెంట్‌తో ఆమెను అరెస్టు చేసింది. ఈ కేసులకు సంబం ధించి కవిత వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. ఈ రెండు బెయిల్ పిటిషన్లను దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. కవితకు బెయిల్ ఇస్తే ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, దర్యాప్తు పై ప్రభావం పడుతుందని కోర్టుకు విన్నవించాయి. ఈ పిటిషన్లపై వాదనలను ఇప్పటికే పూర్తిచేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఇవాళ మధ్యాహ్నం తీర్పును వెలువరిం చనున్నారు. కవితకు బెయిల్ లభిస్తే జ్యుడీషయల్ రిమాండ్ నుంచి మినహాయింపు లభిస్తుంది. కోర్టు తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.


