ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకి చేరికల జోష్ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఇవాళ హస్తం పార్టీలో చేరనున్నారు. కుత్బుల్లా పూర్ లోని కూన శ్రీశైలం గౌడ్ నివాసానికి వెళ్లిన మైనంపల్లి హన్మంత రావు, పట్నం మహేందర్ రెడ్డి, కొలన్ హన్మంతరెడ్డి, భూపతి రెడ్డిలు.. కాంగ్రెస్‌లోకి రావాలని ఆయనను ఆహ్వానించారు. PCC అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కూన శ్రీశైలం గౌడ్ ఇవాళ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.


