స్వతంత్ర, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఇటు రాజకీయాల్లో, అటు సినిమాల్లోనూ విపరీతమైన అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. పవన్ పై ఉన్న అభిమానాన్ని ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో చాటి చెబుతాంటారు. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన ఓ అభిమాని జనసేనానిపై తనకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నాడు. జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన లచ్చిపతుల రంజిత్ కుమార్ జనసేన ఐటీ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఆయన వివాహం ఘనంగా జరిగింది. అయితే తన పెళ్లి ఆహ్వాన పత్రికపై వారాహితో పాటు పార్టీ హామీలను ప్రచురించి జనసేనకు మరింత ప్రచారం కల్పించే ప్రయత్నం చేశారు. ఈ కార్డును స్నేహితులు, బంధువుల్లో ఆసక్తిగా తిలకించారు.