కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. ప్రతిపక్షాలు రెండు రకాలుగా ఉంటారని, ఒకరు వాస్తవాలు మాట్లాడే వారు, మరొకరు ఏది లేకపోయినా అవాస్తవాలు ప్రచారం చేసేవారుంటారని ఫైర్ అయ్యారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్‌రెడ్డి మంత్రి ఉత్తమ్‌పై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం కూడా తరుగు లేకుండా కొనుగోలు చేస్తామని మంత్రి ప్రకటించారన్నారు. తాను కూడా క్షేత్రస్థాయిలో ఉన్న ఐకేపీ సెంటర్ల వద్ద చెక్ చేసి వచ్చా, తడిసి రంగుమారి మొలకెత్తిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. మూడు, నాలుగు రోజుల్లో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందన్నారు.


