తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల జాతర షురూకానుంది. ఎన్నికల కోడ్ ముగియడంతో పూర్తిస్థాయి పదవులపై ఫోకస్ పెట్టిన హస్తం నేతలు కసరత్తులోఉన్నారు. దీంతో ఆశావహులంతా గాంధీభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మరి ఎవరిని పదువులు వరించనున్నాయి. ఎవరికి ఏ పదవులు దక్కను న్నాయి.? సీఎం రేవంత్ మనసులో ఉన్నదెవరు..?
తెలంగాణ కాంగ్రెస్‌లో పందేరానికి వేళయింది. ఎన్నికల కోడ్ ముగియడంతో వీలైనంత త్వరగా పదవులను భర్తీ చేసేం దుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. దీంతో ఆశావహులంతా గాంధీభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సీఎం రేవంత్‌తో పాటు మంత్రుల మన్ననలను పొందే ప్రయత్నంలో ఉన్నారు. అయితే,.. పదవుల కోసం అనేకులు పోటీ పడుతున్నా.. పార్టీ కోసం పని నిబద్ధతతో పని చేసిన వారికి, టికెట్ ఇవ్వని నేతలకు మాత్రమే అవకాశమిచ్చే యోచనలో ఉంది రాష్ట్ర నాయకత్వం. కొత్తగా పార్టీలో చేరిన వారికి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నాయకులకు ఇప్పట్లో ఎలాంటి పదవులు లేవని తేల్చి చెబుతోంది. మరోపక్క ఎన్నికల కోడ్‌కు ఒక రోజు ముందే 37 మంది నేతలను కార్పోరేషన్ ఛైర్మన్‌లుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా అఫిషియల్‌గా జీవో రాకపోవడవంతో వారెవరూ బాధ్యతలు స్వీకరించలేదు. ఇక కోడ్ ముగియడంతో ప్రభుత్వ కార్యకలాపాల తోపాటు పాలనా వ్యవహారా లు కూడా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో 37 మంది ఛైర్మన్లు ఒకట్రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే మరో 17 కార్పోరేషన్‌లకు కూడా ఛైర్మెన్‌లను నియమించే యోచనలో ఉంది కాంగ్రెస్ సర్కార్.
ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పదవుల భర్తీపై కసరత్తు ప్రారంభించడంతో ఆశావాహులు అంతా సీఎం, మంత్రులు, గాంధీ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గతంలో పార్టీ తమకు ఇచ్చిన హామీలు, తాము పార్టీకి చేసిన సేవలను గుర్తు చేస్తూ, తమకే పదవులు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇటు రాష్ట్ర పార్టీ నేతలే కాదు ఢిల్లీ స్థాయి నుండి రికమండేషన్ రావడంతో పదవుల భర్తీ ఆలస్యంకానున్నట్టు తెలుస్తోంది. అయితే కీలకమైన విద్యా మిషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్, వ్యవసాయ కమిషన్‌లతో పాటు విశ్వ విద్యాలయాలకు వీసీల నియామకం తదితర వాటి భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మూసీనది అభివృద్ది కార్పొరేషన్, ఆర్టీసీ కార్పొరేషన్, పౌర సరఫ రాలశాఖ కార్పొరేషన్‌లు ఎమ్మెల్యే స్థాయి నాయకులకు ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. మరోపక్క వందకు పైగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు ఉండగా, ఇప్పటి వరకు 50 లోపే భర్తీకాగా, మిగిలినవి నియామకాలు చేయాల్సి ఉంది. అయితే ఈ పోస్టుల కోసం అధికార ప్రతి నిధులు అద్దంకి దయాకర్, భవాని రెడ్డి, చరణ్ కౌసిక్ యాదవ్‌లు, పార్టీ కోసం పని చేసిన కైలాస్ నేత, చారగొండ వెంకటేష్ తదిత రులతో పాటు జిల్లాస్థాయిల్లో గాంధీభవన్‌లో పార్టీ కోసం పూర్తిగా అంకితమై పని చేస్తున్న నాయకులు నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. వీరి ఎంపిక విషయంలో గతంలో మాదిరి కాకుండా విద్యార్హతలు, సేవలను దృష్టిలో ఉంచుకుని పదవులు కట్టబెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం.
పదవుల భర్తీ విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై ఆసక్తి నెలకొంది. భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్ రెడ్డిని గెలిపించుకుని వస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి అప్పగించే అవకాశముందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆరు మంత్రి పదవులే ఉండటం, అవి కూడా సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని భర్తీ చేయాల్సి ఉండడంతో సామాజిక సమీకరణాలు, పార్టికీ విధేయత అన్న అంశాల ఆధారంగానే ఎంపిక జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే, పోస్ట్‌లు తక్కువ ఉండడం, ఆశా వహులు ఎక్కువ సంఖ్యలో ఉండడం కారణంగా నామినేటెడ్ పదవుల భర్తీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కత్తిమీదసాములా మారింది. అదే సమయంలో మరింత ఆలస్యం చేస్తే పార్టీ నేతల్లో అసంతృప్తి పేరిగే ప్రమాదముందని అంచనా వేస్తోంది. దీంతో ఏది ఏమైనా నాలుగైదు రోజుల్లో అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని డిసైడ్ అయిందట రేవంత్ సర్కార్.
మొత్తానికి పదవుల భర్తీపై కసరత్తు ప్రారంభించడంతో హస్తం నేతల్లో ఆసక్తి నెలకొంది. తమ ప్రయత్నాలు ఫలిస్తాయా..? అనుకున్న పదవి దక్కుతుందా అని ఆశావహులు టెన్షన్‌గా ఎదురుచూస్తున్నారు. మరి సీఎం రేవంత్ ఎవరిని ఖరారు చేస్తారు.? ఎవరిని పక్కన పెడతారు.? ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది.