స్వతంత్ర వెబ్ డెస్క్: గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఐటీ రంగం సృష్టించిన ఉద్యోగాల్లో 44% వాటాతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ ఎగుమతులు, ఎస్సార్డీపీపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. 2014 నాటికి ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లు కాగా.. 2014 నుంచి 2023 నాటికి రూ.2,41,275 కోట్లకు ఎగబాకినట్టు వెల్లడించారు. 2023 నాటికి ఐటీ ఎగుమతులు 31.44 శాతం పెరిగాయని, ఇది దేశంలోనే అత్యధిక వార్షిక పెరుగుదల అని చెప్పారు. ప్రపంచం మొత్తానికే తెలంగాణ ఐటీ గమ్యస్థానంగా మారిందని ఆపిల్, అమెజాన్, గూగుల్, సేల్స్‌ఫోర్స్, ఊబర్, స్టేస్ట్రీట్స్, మైక్రాన్, డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, ఇంటెల్, ప్రావిడెన్స్, ఎంఫొసిస్, డీబీఎస్ వంటి ఎన్నో ప్రముఖ సంస్థలు తెలంగాణకు వచ్చాయని వివరించారు.
KTR: పాతబస్తీని ఐటీబస్తీగా మార్చే బాధ్యత నాదే..!
ఫేస్‌బుక్, క్వాల్కమ్, యాక్సెంచర్, వెల్‌కార్గో, జైలింగ్స్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, టీసీఎస్, ఐబీఎం, టెక్‌మహీంద్ర, కాగ్నిజెంట్, విప్రో వంటి కంపెనీలు గణనీయంగా విస్తృతమయ్యాయని తెలిపారు. పాతబస్తీని ఐటీబస్తీగా మార్చే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. మలక్‌పేటలో సైతం ఐటీ టవర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. ద్వితీయశ్రేణి పట్టణాలకు కూడా ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. నాడు బీఆర్‌ఎస్ మంత్రిగా ఈటల రాజేందరన్న ఉన్నప్పుడు.. నేనూ అన్న హుజూరాబాద్‌కు వెళ్లి అక్కడొక ఐటీ కంపెనీ ప్రారంభించామని, ఆయన బీజేపీలోకి పోగానే అది బంద్ అయిందని వెల్లడించారు.
Latest Articles
- Advertisement -