మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం రావడంతో ఆయన నివాసానికి సినీ ప్రముఖులు వెల్లువెత్తుతున్నారు. ఈ క్రమంలో యువ దర్శకుడు తల్లాడ సాయికృష్ణ కూడా చిరంజీవి నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్భంగా తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ…‘‘అన్నయ్య , బాస్, మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావడం తెలుగు సినీ పరిశ్రమ కి గర్వ కారణం, మెగస్టార్ ని కలవడం అనేది నా చిరకాల కోరిక. నా బర్త్ డే కూడా ఆగస్టు 22నే, చిన్నప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి గారి నాకు రోల్ మోడల్. ఆయనతో ఫోటో దిగితే చాలు అనుకునే వాడిని. అలాంటిది మెగాస్టార్‌తో 5 నిమిషాలు మాట్లాడే సమయం దొరకడం చాలా సంతోషంగా ఉంది. బాస్ నన్ను దీవించారు. బాస్ ఆశీస్సులు ఉంటే చాలు నాకు సినీ పరిశ్రమలో ఇంకా ముందుకు వెళ్తాను.’’ అని సంతోషాన్ని వ్యక్త పరిచారు.


