స్వతంత్ర, వెబ్ డెస్క్: బీఆర్ ఎస్ పార్టీ ని బంగాళాఖాతంలో వేయడం ఖాయమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ లో భట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకుల జీవితాల్లో భారీగా మార్పులు, వేల కోట్ల రూపాయలు, ఫామ్ హౌస్ లు వచ్చాయని అన్నారు. సాధారణ ప్రజల జీవితాల్లో ఏమి మార్పు లేదు కానీ.. గుత్తాకు గుర్రంపోడులో మంచి ఫామ్ హౌస్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కి సీనియర్ మంత్రులుగా పని చేసిన అభివృద్ధే తప్ప బీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏమి లేదన్నారు.
తెలంగాణలో పోలీస్.. పడగనీడలో ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ కుటుంబమే అడ్డుగా ఉందన్నారు. రేషన్లో బియ్యం తప్ప ఏమి ఇవ్వడం లేదు. తెలంగాణపబ్లిక్ సర్వీస్ పరీక్షలు ఒక్కటి పెట్టి అది కూడా లీకేజీ అయిందని విమర్శించారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ వెంట అనేక బడుగు బలహీన వర్గాల బలం ఉందన్నారు. నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బీసీ కి ఇప్పటికి నీరు ఇవ్వలేదు. దాదాపు 4లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలని నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఎస్ఎల్బీసీను కేటాయించారు.కానీ ఇప్పటికి చుక్క నీరందలేదు. తెలంగాణ లో మంత్రులు గాడిదలు కాస్తున్నారన్న భట్టి..జిల్లా మంత్రి మాత్రం మంత్రిగా పని చేయడం లేదన్నారు. డిండి నుండి సాగు నీరు ఇవ్వట్లేదు కానీ.. మండలి ఛైర్మన్ గుత్తా ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడే సత్తా ఉందా అని ప్రశ్నించారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గoలో జైవీర్ రెడ్డి చేపట్టిన గిరిజన చైతన్య యాత్రను జయప్రదం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అమరులు ప్రాణత్యాగ ఫలితంతో కొట్లాడి తెచ్చుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ ఇచ్చిందన్న భట్టి.. రాష్ట్రంలో 4 కోట్ల మందికి అన్ని సదుపాయాలు వస్తాయని ఆశిస్తే రాష్ట్ర వనరులు మొత్తం సీఎం కేసీఆర్ ఆయన కుటుంబానికి దక్కాయని అన్నారు.