భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. ఆదిత్య ఎల్-1 వ్యోమ నౌకను లగ్రాంజ్ పాయింట్ 1 కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. భూమి నుంచి సూర్యుని దిశగా సుమారు పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి దీన్ని పంపించారు.
సూర్యుడిని అధ్యయనం చేసేందుకు నింగిలోకి దూసుకెళ్లింది ఆదిత్య ఎల్-1. ఇప్పుడు ఈ కీలక ప్రక్రియ విజయవంతం కావడంతో ఇది నిరంతరాయంగా సూర్యుడిని పర్యవేక్షిస్తుంది. అదే సమయంలో సౌరవాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఈ ప్రయోగం లక్ష్యం. దేశం తరఫున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే.
ఇక, ఆదిత్య ఎల్-1 కీలక ప్రక్రియ విజయవంతం కావడంతో ఇస్రోపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు… శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.