Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

 తెలంగాణలో త్రిముఖ పోరు తప్పదా ?

   ఓవైపు దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తోందన్న అంచనాల నేపథ్యంలో రాష్ట్రంలో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పెట్టుకున్నా రు కమలనాథులు. ఇక, పదేళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకున్న హస్తం పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని పక్కాగా స్కెచ్చు లేస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్.

       ఆపరేషన్ తెలంగాణ.. పార్లమెంటు ఎన్నికల వేళ కమలనాథుల వ్యూహం ఇదేనా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. అందుకు తగ్గట్లుగానే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు బీజేపీ నేతలు. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నుంచి టార్గెట్ తెలంగాణ మొదలుపెట్టిన కాషాయ పార్టీ ఒక్కో అడుగు ముందుకేస్తున్నట్లుగా.. ఎక్కడికక్కడ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుంటూ వెళుతోంది.

     చాపకింద నీరులా.. తమ వ్యూహాలను అమలు చేసుకుంటూ ముందుకెళుతున్న బీజేపీ.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాబట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 8 శాసనసభా స్థానాలను సాధించింది. కచ్చితంగా గెలుస్తారనుకున్నపెద్ద నేతలు ఓటమి పాలైనా… మిగిలిన వారు విజయం సాధించి పార్టీ పరువు కాపాడారు. ఇంకా చెప్పాలంటే కామారెడ్డి స్థానంలో బీజేపీ నుంచి బరిలో దిగిన కె. వెంకటరమణా రెడ్డి అయితే.. సరికొత్త చరిత్రే సృష్టించారు. నాడు సీఎం హోదాలో బరిలో దిగిన కేసీఆర్‌తోపాటు టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డిపై గెలుపొంది కమలం జెండా ఎగురవేశారు. అటు.. మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన వారు కూడా ఎక్కువ మంది ఉత్తర తెలంగాణ అభ్యర్థులే కావడంతో బీజేపీ ఆ ప్రాంతంలో బలమైన శక్తిగా మారిందన్న వాదన విన్పించింది. దీంతో.. దక్షిణ తెలంగాణ కంటే ఎక్కువగా ఉత్తర తెలంగాణపై లోక్‌సభ ఎన్నికల్లో ఫోకస్ పెట్టింది కమలం పార్టీ.

     అందుకు తగినట్లుగానే బీజేపీ అగ్రనాయకత్వం ఉత్తర తెలంగాణ జిల్లాలే టార్గెట్‌గా లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వెళుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా విడుదల చేసిన తొలి జాబితాలో కమలనాథులు 9 మంది అభ్యర్థులను సైతం ప్రకటించారు. అంతే కాదు.. స్వయంగా ప్రధాని మోడీయో రెండు రోజుల పాటు ఆదిలాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ప్రకటించారు ప్రధాని మోడీ. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా హైవేల నిర్మాణం, గిరిజన యూనివర్శిటీ సహా పలు అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు ప్రధాని.

     రాజకీయంగానూ పలు కీలక విమర్శలు, ఆరోపణలు గుప్పించారు మోడీ. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగడం.. అందుకు దారి తీసిన పరిస్థితులను ప్రస్తావించిన ప్రధాని…ఈ సందర్భంగా బీఆర్ఎస్‌ పాలనను ఎండగ ట్టారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలై కాంగ్రెస్ పార్టీ వచ్చినా ప్రజలకు ఒరిగిందేమీ లేదంటూ దెప్పిపొడిచారు. అసలు.. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనంటూ ఘాటైన విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. తద్వారా తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్న సందేశాన్ని తన వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పారు ప్రధాని.ఓవైపు దేశవ్యాప్తంగా బీజేపీ హవా వీస్తోందని.. మోడీ మ్యాజిక్ మరోసారి పనిచేస్తుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

    అటు.. కమలం నేతలది సైతం ఇదే మాట. స్వయంగా ప్రధాని మోడీ సైతం ఈసారి బీజేపీకి సింగిల్‌గానే 370 సీట్లు.. ఎన్డీఏకు 400 స్థానాలు గ్యారెంటీ అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇలాంటి వేళ.. మోడీ ఫోటోతో తెలంగాణలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలన్నది కాషాయ పార్టీ వ్యూహం. అందుకు తగినట్లుగానే ఉత్తర తెలంగాణ లో పార్టీకి సానుకూల ఫలితాలు రావడంతో.. ఎక్కువ లోక్‌సభ స్థానాలు ఇక్కడి నుంచే ఒడిసిపట్టాలని స్కెచ్ వేస్తోంది. అతి త్వరలోనే ఎన్నికల షెడ్యూలు విడుదల కానుంది. ఒకసారి ఎన్నికల తేదీలు వచ్చాక ఆపరేషన్ తెలంగాణను మరింత ముమ్మరం చేయనున్నారు కమలనాథులు. ఒకరి వెంట మరొకరు అన్నట్లుగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణ గడ్డపై ప్రచారాన్నిహోరెత్తించనున్నారు. మరి.. కాషాయ పార్టీ వ్యూహాలు లోక్‌సభ ఎన్నికల్లో ఎంత మేరకు వర్కవుటవుతాయి ?

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్