33.5 C
Hyderabad
Wednesday, March 11, 2026
spot_img

బీఆర్ఎస్ కి అభ్యర్థులు కరువయ్యారా ?

    ఒకప్పుడు సంచలనాలకు కేరాఫ్ గా నిలిచిన ఆ పార్టీకి ప్రస్తుతం ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కరువయ్యారా…? ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు సుముఖత వ్యక్తం చేయడం లేదా…? ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగి, ఇప్పుడు ఈ స్థితికి చేరిన ఆ పార్టీ ఏమిటి..? ఇంతకీ ఏ జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థులు కరువ య్యారు.?

       ఇప్పటి బీఆర్ఎస్.. ఒకప్పటి టీఆర్ఎస్ అంటే ఎదురు లేని పార్టీగా పేరొ పొందింది. అభ్యర్థి ఎవరైనా పార్టీ తరఫున నిలబడ్డారు అంటే విజయం ఖాయం అయ్యేది. ప్రత్యర్థికి డిపాజిట్ సైతం దక్క కుండా ఓడించి పారేయడం బీఆర్ఎస్ కు వెన్నతో పెట్టిన విద్యలా ఉండేది. అయితే, ఇదంతా గతం. వర్తమానంలో ఆ పార్టీ పరిస్థితి దయనీ యంగా మారింది. తెలంగాణలో తొలి సర్కారు ఏర్పాటు చేసి దశాబ్దకాలం పాటు అప్రతిహతంగా పాలన సాగించిన బీఆర్ఎస్…నాడు రాష్ట్రంలో ప్రతిపక్షానికి ఉనికే లేకుండా చేసింది. నాడు కారు సారు కేసీఆర్ అంటే గులాబి పార్టీలో అందరికి గురుతుల్యులే. ఆయన మాటంటే ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు వేదవాక్కు. ఓటములను ఆమడదూరం పెట్టే.. అంత గొప్ప బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో పరాజయం పాలైంది. పురోగమనం తప్ప తిరోగమనమే ఎరుగని ఆ పార్టీకి ఇప్పుడు ఎదురీదాల్సిన దుస్థితి ఏర్పడింది.

     గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది. 2014 ,2019 ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి ప్రతిపక్షాలకు చెక్ పెట్టారు. అయితే, 2023 ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ కేవలం రెండు సీట్లే గెలుపొందింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తంగా 14 అసెంబ్లీ స్థానాలుండగా, అలంపూర్, గద్వాల నియోజకవర్గాలలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిం చారు. రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ గత పాలనా వైఫల్యాలను ఎండగడుతూ, బీఆర్ఎస్ పాలకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. మాటల మాంత్రికుడు, వక్తాగ్రేసరుడుగా పేరొందిన కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గట్టెక్కించ లేకపోయారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రీతిలో ముందుకు వెళతారో, ఏ మేరకు విజయాలు సాధిస్తారో చూడాల్సి ఉంది.

     ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రతి పార్లమెంటు నియోజక వర్గ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉండగా.. ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గలలో ఏడేడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక ఏ పార్టీలు ఏ అభ్యర్థులను రంగంలోకి దించుతున్నారనే విషయాలు పరిశీలిస్తే.. జాతీయ పార్టీ కాంగ్రెస్ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి వంశీ చంద్ రెడ్డి ని ప్రకటించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న మరో జాతీయ పార్టీ బీజేపీ, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానానికి పోతుగంటి భరత్ ను ఇప్పటికే ఖరారు చేసింది. నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం కసరత్తు చేస్తుంది.. మాజీ ఎంపీ మల్లు రవిని అధిష్టానం ఓకే చేసినట్టు ప్రచారం సాగుతోంది. అయితే, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తాను నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానానికి తాను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని ప్రకటిస్తున్నారు.

    కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ నియోజకవర్గ అభ్యర్ఙి పేరును గోప్యంగా ఉంచగా, బీజేపీ మాత్రం అభ్యర్థి ఖరారు విషయంలో సఫలీకృతమైనట్టు తెలుస్తోంది. అయితే, మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి పోటీచేసే అభ్యర్థులు అధికంగా ఉండటంతో, బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మాజీ మంత్రి డీకే అరుణకు సీటు దక్కవచ్చనే వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటనలు ముందంజలో ఉండగా, బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థుల కోసం వెదుకులాట సాగిస్తు న్నట్టు తెలుస్తోంది. గడిచిన మూడు నెలల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అనేక రాజకీయ పరిణా మాలు చోటు చేసుకుంటున్నాయి. మహబూబ్ నగర్ మున్సిపాలి టీలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ మద్దతుతో చైర్మన్ పోస్ట్ కైవాసం చేసుకున్నది. ఇలా అనేక మంది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు సైతం బీఆర్ఎస్‌ని వీడారు. అనంతరం బీజేపీలో చేరి తన కుమారుడు, జడ్ పీటీసీ సభ్యుడు పి భరత్ కు ఆ పార్టీ ఎంపీ టికెట్ తెచ్చుకోవడంలో విజయం సాధించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి జడ్ పీ ఛైర్ పర్సన్ సైతం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

     కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ప్రకటన స్థాయికి చేరితే, బీఆర్ఎస్ ఇప్పటికీ అభ్యర్థుల వేటలోని కొట్టుమిట్టాడుతోంది. ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థులు కరువయ్యారని ప్రచారం సాగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు తిప్పికొ ట్టారు. ఎంపీ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయభేరి మోగిస్తుందని తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానానికి కొందరు సుముఖత చూపిస్తున్నారని తెలిసింది. అయితే, ఖర్చు విషయం వల్ల సందిగ్ధంలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దనరెడ్డి పేరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వినిపించింది. కొన్ని కారణాల వల్ల తాను ఎమ్మెల్సీగా పోటీ చేయలేనని మర్రి జనార్దనరెడ్డి అధిష్ఠానానికి తెలియజేసినట్టు సమాచారం.

    ఎంపీ స్థానాలకు పార్టీ అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ రంగంలోకి దిగారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహిం చారు. ఈ భేటీలో ఎంపి స్థానాల అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ స్థానానికి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, ప్రస్తుత సిటింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి మరోసారి మహబూబ్ నగర్ నుంచి పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నారని వెల్లడైంది. నాగర్ కర్నూల్ ఎంపీ స్థానానికి ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై బీఆర్ఎస్ పెద్దలు సుదీర్ఘ ఆలోచనలు సాగిస్తు న్నట్టు తెలిసింది. ఏది ఏమైనా పదేళ్లపాటు అప్రతిహాసంగా పాలన సాగించిన బిఆర్ఎస్ కు ఇప్పుడు ఎంపీ స్థానాలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని ప్రచారంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర కలత చెందుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ దూకుడుతో బీఆర్ఎస్ కు  అభ్యర్థులు కరువయ్యారన్న ప్రచారం సాగుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలకు తమ పార్టీ అభ్యర్థుల ను త్వరలో ప్రకటిస్తా మని రాష్ట్ర అధినాయకత్వం తెలియజేస్తోంది. అయితే ఈ ఇద్దరు అభ్యర్థులు మాజీలా, కొత్త అభ్యర్థులా అనేది తేలా ల్సి ఉంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్