27.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

ఈ వైసీపీ అభ్యర్థులకు ఇంటిపోరుతో ఓటమి తప్పదా?

    వైసీపీలోని ఆ ఇద్దరు కాపు ప్రముఖులకు ఇంటి పోరు తప్పడం లేదా..? వైసీపీ విజయమే లక్ష్యంగా ఆ నేతలు ప్రతి పక్షాలను టార్గెట్ చేస్తుంటే, సొంత కుటుంబ సభ్యులే వారిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు.? ఎందుకు ఆ నేతలకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడం లేదు..?

   ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తు న్నాయి. ప్రచారం లో నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. అయితే ఎన్నికల ముందు వరకు ఎలా ఉన్నా..పోలింగ్ తేదీ దగ్గరపడే కొద్దీ రాజకీయాలు శరవేగంగా మారిపోతుంటాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతల కోసం ఇంటిల్లి పాది కష్ట పడుతున్న దృశ్యాలు ఒక వైపు ఉంటే, మరోవైపు సొంత కుటుంబ సభ్యుల నుంచే కొందరు నేతలకు ఇబ్బందులు వస్తున్నాయి. మా వాళ్లని గెలిపించ వద్దని కొందరు అంటుంటే, తమ సొంత కుటుంబ సభ్యుల మాటలు నమ్మవద్దం టూ మరికొంత మంది ఎదురు తిరుగుతున్నారు.ఎన్నికల ముందు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసిపిలో చేరారు. ఈ ఎన్నికల్లో వైసిపి విజయమే లక్ష్యంగా అయన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అదే సమయం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విమర్శలు ఎక్కు పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో కాపు ఉద్యమ నేత ముద్రగడను రంగంలోకి దింపింది వైసిపి. ముద్రగడ కూడా ఈ ఎన్నికలను సిరియస్ గా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ని ఓడిస్తామని అలా చేయలేకపోతే, తన పేరుని పద్మనాభ రెడ్డిగా మార్చు కుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు ముద్రగడ వైసిపి విజయం లక్ష్యంగా పని చేస్తుంటే, ఆయన కుమార్తె క్రాంతి ముద్రగడకు వ్యతిరేఖంగా గళం విప్పారు. కేలవం పవన్ కళ్యాణ్ తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి తను చేస్తానని క్రాంతి తెలిపారు.

ఇకపోతే మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజక వర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో విజయంకోసం అంబటి రాంబాబు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా మంత్రి అంబటి రాంబాబు పై అయన అల్లుడు తీవ్ర విమర్శలు చేస్తూ వీడియో విడుదల చేశారు. అంబటి లాంటి వాళ్లకు ఓటేస్తే సమాజం తలరాత మారి రేపటి సమాజం కూడా ఇలాగే తయారవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి అంబటికి ఓటు వేయొద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడికి ఇంటిపోరు తప్పడం లేదు. ముత్యాల నాయుడు కుమారుడు రవికుమార్ మాడుగుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదే స్థానం నుంచి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధ వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అంతే కాదు మాడుగులలో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ముత్యాల నాయుడు కుమారుడు రవికుమార్ తండ్రికి మరో షాకిచ్చారు. ఈసారి ఏకంగా తన తండ్రిని ఓడించండి అంటూ బూడి రవికుమార్‌ ప్రచారం చేస్తున్నారు. తనకే న్యాయం చేయలేని వారు. ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలరని బూడి రవికుమార్ విమర్శలు సంధిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్