స్వతంత్ర వెబ్ డెస్క్: క్రికెట్ అభిమానుల కన్నుల పండుగ ఐపీఎల్. ఈ ఏడాది కూడా అభిమానులకి మంచి వినోదాన్ని ఇచ్చింది. ఇంకా 16వ సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారో..? కప్ ఎవరి సొంతం అవుతుందో? 20లక్షల ప్రైజ్ మనీ ఎవరు అందుకుంటారు అన్ని ఎంతో అత్రుతుగా ఎదురుచూసిన అభిమానులకి వరుణుడు తీవ్ర నిరాశలో ముంచేశాడు. దీనితో ఎప్పుడు లేని విధంగా మొదటిసారి ఐపీఎల్ ఫైనల్స్ వాయిదా పడింది. నిన్న రాత్రి 7:30కి మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా.. దానికి గంట ముందు నుంచి వర్షం ముంచెత్తింది. దీంతో స్టేడియంలో నీటి మడుగులు ఏర్పడటంతో గంట తరువాత కూడా ఆట సాధ్యం కాదని తేలడంతో.. ఫైనల్‌కి సోమవారం కూడా రిజర్వ్ డే ఉండటంతో మ్యాచ్‌ను రద్దు చేసి నేటికీ వాయిదా వేశారు.
ఆదివారం వర్ష సూచన లేకపోయినా.. వరుణుడు ముంచెత్తగా, నేడు వర్షం పడేందుకు ఆస్కారం ఉండటం ఆందోళన రేకెత్తించేదే. సోమవారం మ్యాచ్‌కూ పరిస్థితులు సహకరించకుంటే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
అదీ సాధ్యపడక మ్యాచ్ రద్దయితే..? రిజర్వు రోజు కూడా వర్షం పడితే విన్నర్ ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఐపీఎల్ తుది నిబంధనల ప్రకారం.. వర్షం కారణంగా సోమవారం కూడా రిజర్వ్ డే ఆట ఆడలేకపోతే, లీగ్ దశ తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును విజేతగా పరిగణిస్తారు. ఈ విధంగా, హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ IPL 2023 ఛాంపియన్ అవుతుంది.