28.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

బెంగళూరు రేవ్‌పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నటి హేమ అడ్డంగా దొరికి పోయింది. హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు టెస్ట్‌లో నిర్దారణ అయినట్లు సమాచారం. డ్రగ్స్ టెస్ట్‌లో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్టు నిర్దారించిన పోలీసులు నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించారు తెలుస్తోంది. 150 మంది బ్లడ్ శాంపిల్స్ నార్కొటిక్ టీమ్ పరీక్షించింది.

పరీక్షించిన డ్రగ్స్ టెస్ట్ లో 86 మందికి పాజిటివ్ వచ్చింది. 57 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లను గుర్తించారు. అందులో టాలీవుడ్ సినీ నటి హేమకు కూడా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. హేమను బాధితురాలుగా పరిగణించే అవకాశముంది. హేమను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశముందని సమాచారం. ఇందులో పలువురు సినీప్రముఖులు, రాజకీయ నేతలు ఉన్నట్టు సమాచారం. ఒక్కొక్కరూ బయటపడుతున్నారు.రేవ్‌ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ పాజిటివ్ వచ్చింది. నటి హేమతో పాటు వాసు, చిరంజీవికి కూడా పాజిటివ్‌ వచ్చింది. హేమ తన పేరును కృష్ణవేణిగా మార్చుకుని రేవ్‌ పార్టీకి హాజరైనట్టు తెలుస్తోంది. వీరందరికీ సీసీబీ నోటీసులు ఇవ్వనుంది.

బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌ అనేది హైదరాబాద్‌‌కు చెందిన గోపాల్‌ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. తెల్లవారుజామున 3 వరకు జరిగిన రేవ్‌ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్‌, కోకైన్‌ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. బెంగళూరు రేవ్ పార్టీ సినీ ఇండస్ట్రీనేకాదు.. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. రేవ్ పార్టీ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ దొరకడంతో సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్స్ రాకెట్ కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

బెంగళూర్‌ ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్‌ పార్టీ జరిగింది. సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ పేరుతో బర్త్‌డే పార్టీ ముసుగులో ఈ పార్టీ నిర్వహించారు. ఇందుకోసం నిర్వాహకులు రెండు లక్షల ఎంట్రీ ఫీజు తీసుకుని 200 మందిని ఆహ్వానించారు. రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకకు చెందిన క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు సైతం పాల్గొన్నారు. ఆదివారం ఉదయమే కొందరు రిసార్ట్‌ నుంచి వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లు అర్ధరాత్రి జరిగిన పార్టీలో పాల్గొన్నారు.

మరోవైపు దొరికిన వంద మందిలో 30 మంది యువతులే ఉన్నారు. నిర్వాహకులే వాళ్ల కోసం టికెట్లు వేసి విమానాల్లో రప్పించినట్లు తెలుస్తోంది. దీంతో రేవ్‌ పార్టీలో వ్యభిచార దందా నిర్వహించి ఉంటారని, నిర్వాహకులు కూడా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నిర్వహకుల నేర చరిత్ర పై కూపి లాగుతున్నారు. డ్రగ్స్ దొరకడం, డబ్బును విపరీతంగా ఖర్చు చేసి ఈ రేవ్‌ పార్టీ నిర్వహించడంతో పోలీసులు పలు కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. రేవ్ పార్టీ ఘ‌ట‌న‌లో ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పార్టీలో ఎండీఎంఏ, కొకైన్, హైడ్రో గంజా, ఇతర మాదకద్రవ్యాలను వినియోగించారు. దాంతో పార్టీకి హాజరైన వారి నుండి రక్త నమూనాలు సేకరించారు. బ్లడ్‌ రిపోర్ట్స్‌ వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. డ్రగ్స్‌ తీసుకున్నారనే అనుమానాల మధ్య పార్టీకి హాజరైన వాళ్ల నుంచి శాంపిల్స్‌ను సేకరించారు పోలీసులు. వీటి ఫలితాలు ఇవాళ సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉంది. ఈ కేసును ఎలక్ట్రానిక్స్ పోలీస్ స్టేషన్ నుండి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నుంచి నార్కోటిక్ విభాగానికి బదిలీ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్