Uttar Pradesh | ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. వీరంతా కారులో వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని దేవ్రియా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో ఓ భార్య, భర్త వారి నలుగురు పిల్లలు చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు.
Read Also: హైదరాబాద్ కు చేరుకున్న మోడీ.. స్వాగతం పలిగిన బండి, తమిళిసై
Follow us on: Youtube, Instagram, Google News