ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. పార్టీ అధిష్టానం అందరికీ సమన్యాయం చేయలేదంటూ బీసీ నాయకులు, జిల్లా అధ్యక్షుడు, అతని అనుచరులపైకి గొడవకు వెళ్లారు. ప్రకాశం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలలో బీసీ అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో సీట్లు కేటాయించలేదని మండిపడ్డారు. ఐదు జనరల్ నియోజకవర్గాలను ఓసీ అభ్యర్థులకే కేటాయిం చారు కానీ… ఒక సీటు కూడా బీసీలకు కేటాయించలేదని మండిపడ్డారు. సీట్లు కేటాయింపులలో అగ్రవర్ణాలు బీసీలకు అన్యాయం చేశారని జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డిపై వాదనకు దిగారు. బీసీలకు సముచిత న్యాయం కల్పించి సీట్లు కేటాయించాలని వారు కోరారు.