స్వతంత్ర వెబ్ డెస్క్: సాంకేతిక సమస్య కారణంగా ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కి సమాచారం ఇవ్వడంతో బుధవారం డెహ్రాడూన్‌కు వెళ్లే ఇండిగో విమానం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, అవసరమైన మెయింటెనెన్స్ ప్రక్రియలు చేపడతామని ఇండిగో తెలిపింది. ఇంజిన్ ఫెయిల్ కావడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ టు డెహ్రాడూన్ ఇండిగో విమానం సాంకేతిక సమస్య కారణంగా తిరిగి వచ్చింది. పైలట్ విమానంలో సమస్యను గుర్తించి తమకు సమాచారం అందించాడు. అలాగే అత్యవసర ల్యాండింగ్ కావాలని కోరాడు. ఆ తర్వాత విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అవసరమైన నిర్వహణ తర్వాత తిరిగి ఆపరేషన్‌లో ఉంటుంది’ అని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.
చివరకు సురక్షితంగా ల్యాండింగ్ కావడంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఇంజిన్‌లో మంటలు చెలరేగాయని వచ్చిన వార్తలను ఇండిగో ఖండించింది. సాంకేతిక లోపం కారణంగానే ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యిందని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ నుంచి డెహ్రాదూన్ బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య రావడంతో దానిని గుర్తించిన పైలట్ అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కావాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కి సమాచారం ఇవ్వడంతో బుధవారం డెహ్రాడూన్‌కు వెళ్లే ఇండిగో విమానం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. తదుపరి పరీక్షల అనంతరం తిరిగి ప్రయాణానికి సిద్ధమవుతుంది’ అని ఇండిగో తాజా ప్రకటనలో పేర్కొంది. దీనిపై పౌరవిమానయాన సంస్థ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.