28.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 షెడ్యూల్ విడుద‌ల

    క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 షెడ్యూల్ విడుద‌లైంది. మార్చి 22న బెంగళూరు, చెన్నై మధ్య జరగనున్న తొలి మ్యాచుతో ఐపీఎల్ 17వ సీజ‌న్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు చెన్నైలోని చెపాక్ మైదానం వేదిక కానుంది. తొలి 17 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వ‌ర‌కు జ‌రిగే మ్యాచ్‌ల వివ‌రాల‌ను వెల్లడించారు.

     ఐపీఎల్ 2024లో మార్చి 22వ తేదీన ఈ సీజన్ తొలి మ్యాచ్ జరగనుంది. లోక్ సభ ఎన్నికల దృష్ట్యా తొలి 17 రోజుల కు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ రిలీజ్ చేసింది. మార్చి 22న చెన్నై సూపర్‌ కింగ్స్‌ vs రాయల్ ఛాలెం జర్స్‌ బెంగళూరు మ్యాచ్‌ చెన్నైలో, పంజాబ్‌ కింగ్స్‌ vs ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ మొహాలీలో, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ vs సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ కోల్‌కతాలో నిర్వహించ నున్నారు. మార్చి 24న రాజస్థాన్ రాయల్స్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌ మ్యాచ్‌ జైపుర్‌లో, గుజరాత్‌ టైటాన్స్ vs ముంబయి ఇండియన్స్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నా రు. మార్చి 25న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్‌ మ్యాచ్‌ బెంగళూరులో, మార్చి 26న చెన్నై సూపర్ కింగ్స్‌ vs గుజరాత్‌ టైటాన్స్ మ్యాచ్‌ చెన్నైలో నిర్వహించనున్నారు. మార్చి 27న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs ముంబయి ఇండియన్స్‌ మ్యాచ్‌ హైదరాబాద్‌లో, మార్చి 28న రాజస్థాన్‌ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ జైపుర్లో, మార్చి 29న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు vs కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌ బెంగళూరు లో నిర్వహించనున్నారు. మార్చి 30న ల‌క్నో సూపర్‌ జెయింట్స్‌ vs పంజాబ్‌ కింగ్స్ మ్యాచ్‌ ల‌క్నోలో, మార్చి 31న గుజరాత్‌ టైటాన్స్‌ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో, ఢిల్లీ క్యాపిటల్స్‌ vs చెన్నై సూపర్ కింగ్స్‌ మ్యాచ్‌ వైజాగ్‌లో నిర్వహించనున్నారు.

        ఇక ఏప్రిల్ 1న ముంబయి ఇండియన్స్ vs రాజస్థాన్‌ రాయల్స్ మ్యాచ్‌ ముంబయిలో, ఏప్రిల్ 2న రాయల్ ఛాలెం జర్స్‌ vs ల‌క్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌ బెంగళూరులో, ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్స్‌ vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌ వైజాగ్‌లో, ఏప్రిల్ 4న గుజరాత్ టైటాన్స్‌ vs పంజాబ్ కింగ్స్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 5న హైదరాబాద్‌ vs చెన్నై సూపర్ కింగ్స్‌ మ్యాచ్‌ హైదరాబాద్‌లో, ఏప్రిల్ 6న రాజస్థాన్‌ రాయల్స్ vs రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌ జైపుర్లో, ఏప్రిల్ 7న ముంబయి ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ ముంబయిలో, లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌ ల‌క్నోలో జరుగనుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్