సొంత గడ్డ మీద జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది.ప్రత్యర్థి ఇంగ్లాండ్‌తో కోల్‌కతా వేదికగా జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్‌ను 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది.ఇంగ్లాండ్ బ్యాటర్లకు అడ్డుకట్ట వేసి మూడు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. 34 బంతుల్లో 5 ఫోర్లు , 8 సిక్సులతో 79 పరుగులు చేసి అభిషేక్ శర్మ చెలరేగడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 132 చేసి ఆల్ ఔట్ అయ్యింది.కెప్టెన్ జాస్ బట్లర్ 68 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేయగా, హ్యారీ బ్రూక్, జోఫ్రా ఆర్చర్ మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు వికెట్ కీపర్ సంజూ శాంసన్ మంచి ఓపెనింగ్స్ ఇచ్చాడు. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు తిలక్ వర్మ తనదైన ఆటతో భారత్ గెలుపుకు తోడ్పాటునిచ్చాడు.