స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీకి వేరే మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని అతని భార్య హాసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. గృహహింస కేసులో షమీ అరెస్ట్ వారెంట్‌పై కోల్‌కతా హైకోర్టు విధించిన స్టేను ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ సందర్భంగా దాఖలు చేసిన పిటిషన్‌లో పలు ఆరోపణలు పేర్కొన్నారు. అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధించాడని.. పెళ్లి అయిన తర్వాత కూడా పరాయి మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగించాడని ఆరోపించారు.
కాగా 2018లో షమీతో అతడి భార్యకు విభేదాలు తలెత్తాయి. షమీ తనను వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో షమీపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కోల్‌కతా సెషన్స్ కోర్టు షమీపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అరెస్ట్ వారెంట్‌పై షమీ హైకోర్టును ఆశ్రయించగా స్టే విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.