కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని అన్నారు. ఈసారి ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయని తెలిపారు. ఇండియా కూటమి గెలవ బోతోందని ధీమా వ్యక్తంచేశారు. ఢిల్లీలోని ఏడు సీట్లలోనూ విజయం సాధిస్తామని తెలిపారు. ప్రధాని మోదీ రాజ్యాంగం, రిజర్వేషన్లు వంటి కీలక అంశాలపై దాడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశసంపదను అదానీకి దోచిపెడుతున్నారని మండిపడ్డారు.


