26 C
Hyderabad
Sunday, August 31, 2025
spot_img

స్వతంత్ర సంక్షప్త వార్తలు

లోటస్‌పాండ్‌లో జగన్‌ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చి వేత

  లోటస్‌పాండ్‌లో అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. గతంలో వైసీపీ అధినేత జగన్‌ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి గదుల నిర్మాణం చేశారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణా లు చేయడంతో స్థానికులు. జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కూల్చివేస్తున్నారు.

కుప్పం రేస్కోపై చర్యలు

  వైసీపీ హయాంలో కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ వైసీపీ ప్రభుత్వంలో అవినీతికి కేరాఫ్‌గా మారిం దని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ ఆరోపించారు. జగన్‌ హయాంలో విచ్చలవిడిగా రెస్కో ఉద్యోగ నియామ కాలు చేశారన్నారు. ముడుపులు తీసుకుని ఉద్యోగాలు కల్పించారు. రెస్కోలో అక్రమంగా ఉద్యోగ నియా మకాలపై అసిస్టెంట్‌ డీసీఓ ఆనంద్‌ విచారణ చేపట్టారు. ఉద్యోగ నియామకాలపై శాంతిపురం మండలం తుమ్మిశి గ్రామానికి చెందిన నగేష్‌ జిల్లా సహకార శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

బేగంపూర్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

  కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్ మండల సమీపంలోని బేగంపూర్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 161వ జాతీయ రహదారిపై ఓ కారు ఎక్సెల్ బండిని ఢీకొంది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు మృత దేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు దర్యాప్తు ముమ్మరం చేశారు.

కేసీఆర్ పై అద్దంకి దయాకర్ ఫైర్

   కేసీఆర్ పేరును ప్రభుత్వం బదనాం చేస్తుందనడంలో ఎలాంటి అర్థం లేదని అన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. అన్నీ చేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. అన్ని శాఖలో తాము చెప్పిందే వేదం కదా అని అన్నారు. ఇప్పుడు విచారణలో పేరు రాగానే కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారన్న ఆయన బీఆర్ఎస్ హయాంలో మంత్రులు చేసింది ఏముందని ఆయన నిలదీశారు. విచారణ ముందుకు సాగ కుండా చేసే పని చేయొద్దని సూచనలు చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని విచారణకు ఆదేశిం చామని, ఎవరినో నిందితులుగా చేయడానికి కాదని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు.

జోరుగా సాగుతున్న ఫామ్ లాండింగ్ నిర్మాణాలు

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఫామ్ లాండింగ్ నిర్మాణాలు యదేచ్చగా సాగుతోంది. తంగడపల్లి గ్రామంలో 312, 314, 316, సర్వేనెంబర్ టామ్ లాండింగ్ వెంచర్ నిర్మాణం చేస్తున్నారని, అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తు న్నారని గ్రామస్థులు వాపోతున్నారు. గత బీఆర్ఎస్ హాయాంలో భూముల ధరలను అమాంతం పెంచింది. దీంతో ఖాళీగా ఉన్న భూములను వెంచర్లుగా మార్చి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా పూర్తిగా ఫార్మ్‌ లాండింగ్ వెంచర్ నిర్మాణం చేస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్