Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

ఆస్ట్రేలియాపై అఫ్గనిస్తాన్ 21 పరుగుల తేడాతో ఘన విజయం

టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. సూపర్‌-8లో ఆస్ట్రేలియాపై అఫ్గనిస్తాన్ 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాంటింగ్, బౌలింగ్‌, అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆస్ట్రేలి యాను అఫ్గాన్ ముప్పుతిప్పల పెట్టింది. గుల్బాదిన్ 4 వికెట్లు తీయగా, నవీనుల్ హక్ 3 వికెట్లు పడగొ ట్టాడు. ముందుగా బౌలింగ్ తీసుకోవడం వల్ల తాము ఓటమి చెందలేదని, అఫ్గనిస్తాన్ బాగా ఆడడం వల్ల ఓడిపోయామన్నారు ఆస్ట్రేలియా కెప్టెన్. అఫ్గనిస్తాన్‌పై ఓటమి భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డికి బోధపడిన జ్ఞానం

ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే దీనికి కారణమన్నారు. నాసిరకం మద్యం వైసీపీ ఓటమికి కారణం. మద్యం తాగేవాళ్లు మాకు ఓటు వేయలేదన్నారు. ఆ పాలసీని మార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డికి చెప్పినా ఫలితం లేకపోయిందన్నారు. ఇసుక విధానం వల్ల పేదవర్గాలు తీవ్రంగా నష్టపోయారని, పార్టీలోని కొంతమంది నేతల నోటి దురుసు కూడా ఓటమికి కారణమైందని ఆవదేన వ్యక్తం చేశారు. ఎవరిని అవమానాలకు గురిచేసినా వారిలో కసి పెరిగి విజయం సాధిస్తారని చరిత్ర చెబు తోందన్నారు. తమ ప్రభుత్వంలో జరిగిన తప్పులను సమీక్షించుకుంటామన్నారు.

గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందలేదు – టీజీ భరత్‌

గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందలేదని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి టీజీ. భరత్ అన్నారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధిపై దృష్టిసారిస్తుందన్నారు. పారిశ్రామిక వేత్తగా రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి కి కృషిచేస్తానన్నారు. కర్నూలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే భాద్యత తనపై ఉందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది- కౌశిక్ రెడ్డి

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తనకు వచ్చిన లీగల్ నోటీసులపై కూడా స్పందించారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించొద్దని సూచించారు. రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహ రించిన వారికి మా ప్రభుత్వం వచ్చాక బ్లాక్ డేస్ ఉంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు వింటే అధికారులు ఇబ్బంది పడతారని వార్నింగ్ ఇచ్చారు. బ్లాక్‌ బుక్‌లో అధికారుల పేర్లు రిజిస్టర్‌ చేస్తున్నామని పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు.

రైతుల సాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధం- జుక్కల్‌ ఎమ్మెల్యే తోట

రైతుల సాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి పంటల సాగుకు అవసరమైన నీరు విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. దీంతో నిజాంసాగర్ జలాశయం నుంచి నిజాం సాగర్ ప్రధాన కాలువలోకి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇరిగేషన్ అధికారులు నీరు విడుదల చేశారు. వానకాలం పంటల సాగు కోసం రోజుకు 1500 క్యూసెక్కుల చొప్పున రెండు విడతలలో 2.5 టీఎంసీల నీటిని చివరి ఆయకట్టు వరకు అందిస్తామని ఎమ్మెల్యే పోచారం హామీ ఇచ్చారు.

వేములవాడ సిటీ, ఆలయ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

వేములవాడ రాజన్న ఆలయంతో పాటు పట్టణం సమగ్ర అభివృద్ధి జరపాలన్నదే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని అన్నారు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌. రాజన్న ఆలయం, పట్టణ అభివృద్ధిపై జిల్లా, ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయ విస్తీర్ణం పెంచి, భక్తులకు శీఘ్ర దర్శనం, అధునాతన స్థాయిలో గోశాల, వీఐపీ బ్రేక్ దర్శనం, వసతి గదుల నిర్మాణము వంటి ఏర్పాట్లతో పాటు టూరిజం శాఖ ఆధ్వర్యంలో భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర- కోరుకంటి

సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను కార్మికులు తిప్పికొట్టాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్‌ ఎస్‌ శ్రేణులతో కలిసి చందర్ మీడియాతో మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు రెడీ అవు తున్న కేంద్రానికి రాష్ట్ర సర్కార్‌ వత్తాసు పలుకుతోందని ఆయన మండిపడ్డారు. బొగ్గు వేలంలో కిషన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం పాల్గొనడం సరికాదన్నారు. తెలంగాణలోని బొగ్గు గనులు సింగరేణికే అప్పగిం చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. సింగరేణిని కాపాడుకు నేందుకు కోల్‌బెల్ట్‌ ఏరియా ఎమ్మెల్యే లు ముందుకు రావాలని కోరుకంటి సూచించారు.

నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కట్టుబడి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం- స్పీకర్‌

నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. వికారాబాద్‌లో యువజన సర్వీసులశాఖ ఆధ్వర్యంలో జరిగిన మెగా జాబ్ మేళాలో ఆయన మాట్లాడారు. ఈ మెగా జాబ్ మేళాలో 5 వేల ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు స్పీకర్ చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలం లోనే 30 వేల ఉద్యోగాలు కల్పించినట్లు ప్రసాద్‌కుమార్ తెలిపారు. మరో లక్షా 70 వేల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం

హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన గడువు లోపు రైతు రుణం 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయిని రాజేందర్‌రెడ్డితో పాటు వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

భూ తగాదాలలో అన్నపై తమ్ముడు దాడి

భూతగాదాలలో అన్నపై గడ్డపారతో తమ్ముడు దాడిచేసిన ఘటన సూర్యాపేట జిల్లా నారాయణపురంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పదిరి ధనమూర్తి తన పొలంలో ట్రాక్టర్‌తో దున్నుతుండగా తమ్ముడు వీరబాబు తనకు వాటా ఉందని గడ్డపారతో దాడిచేశాడు. ధనమూర్తి తలకు బలమైన గాయాలు అయ్యా యి. పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ జరిగినా, తనకు ఇంకా భూమి వస్తుందని ధనమూర్తిపై వీరబాబు దాడిచేశాడు. పొలం గట్టుకు ఉన్న రాళ్లను తొలగించినట్లు స్థానికులు తెలిపారు. చిలుకూరు పోలీసు స్టేషన్‌లో ధనమూర్తి ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్